గురు హీరోయిన్.. ఈసారి గ్లామర్ చూపిస్తుందట!

గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది రితికా సింగ్. గురులో ఆమెది పక్కా మాస్ క్యారెక్టర్. వేసుకున్న దుస్తుల నుంచి మాట్లాడే భాష వరకు అన్నింటిలో మాస్ టచ్ కనిపిస్తుంది. ఇలా మాస్…

గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది రితికా సింగ్. గురులో ఆమెది పక్కా మాస్ క్యారెక్టర్. వేసుకున్న దుస్తుల నుంచి మాట్లాడే భాష వరకు అన్నింటిలో మాస్ టచ్ కనిపిస్తుంది. ఇలా మాస్ యాంగిల్ లో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ ఇప్పుడు మోడ్రన్ గా తయారైంది. క్లాసీ లుక్ తో కనువిందు చేయబోతోంది. 

రితికా సింగ్ నటించిన లేటెస్ట్ సినిమా శివలింగ. ఈ సినిమాలో రితికా సింగ్ ను సరికొత్తగా చూడొచ్చు. అందరు హీరోయిన్లలానే రితికాలో కూడా ఎట్రాక్ట్ చేసే గ్లామర్ ఉందట. తన అందచందాలతో శివలింగ సినిమాకు రితికానే మెయిన్ ఎట్రాక్షన్ గా మారిందంటున్నాడు హీరో కమ్ కొరియోగ్రాఫర్ లారెన్స్. 

ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ లో లారెన్స్ మార్క్ స్టెప్పులతో అదరగొట్టింది రితికా సింగ్. ఆమెలో యాక్టింగ్ టాలెంట్ ఇప్పటికే చూసేశాం కాబట్టి, తెలియాల్సిందంతా ఈ భామ వెండితెరపై ఎంత గ్లామరస్ గా కనిపించిదనే విషయమే. మరికొన్ని రోజుల్లో విడుదలకానున్న శివలింగ సినిమాతో రితికా సింగ్ లో హీరోయిన్ మెటీరియల్ ఉందో లేదో తెలిసిపోతుంది.