క్రియేటివ్ డైరక్టర్లందరికీ ఓ సమస్య వుంటుంది. సినిమాను చెక్కుకుంటూ వెళ్తారు. తీరా తీసిన అవుట్ పుట్ తీస్తే రీళ్లకు రీళ్లు వుంటుంది. దాన్ని కట్ చేయగా చేయగా, ఆఖరికి తమ వర్క్ మీద వున్న మమకారం, తమ అయిడియాల మీద వున్న భరోసాతో రెండున్నర గంటలు దాటేస్తుంది సినిమా. తీరా చేసి అవుట్ పుట్ జనాలకు ఓకె అయితే సరే, లేదూ అంటే మాత్రం అంతే సంగతులు.
దర్శకుడు కృష్ణ వంశీ కూడా ఇలా రెండున్నర గంటల సినిమాలకు అతీతమేమీ కాదు. కానీ ఫర్ ఏ ఛేంజ్, పస్ట్ టైమ్ నక్షత్రం సినిమా విషయంలో తన వర్క్ మీద తనకు వున్న మమకారాన్ని పక్కన పెడుతున్నారట. ఎలాగైనా సినిమాను రెండు గంటల్లో ముగిసేలా ఎడిట్ చేస్తున్నారట. తీసినదంతా పక్కన పెడుతున్నారట.
ఈ రెండు గంటల్లో సాయిధరమ్ తేజ నలభై నిమషాలు కనిపిస్తాడట. ఇక సందీప్ కిషన్ వుండనే వుంటాడు. మొత్తం మీద దర్శకుడు కృష్ణ వంశీకి ఈ తరం ఆడియన్స్ పల్స్ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయేమో?