వాట్సప్ లో నిత్యం బోలెడు చమత్కారాలు, జోక్ లు, స్కిట్ లు చలామణీ అవుతుంటాయి. అయితే ట్విట్టర్ లో ఇలాంటి వ్యవహారం తక్కువ. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు సంచలన కామెంట్లు, అప్పడప్పుడు కీరవాణి లాంటి వాళ్ల గొప్పల కామెంట్లు తప్ప, జోక్ లు తక్కువ. ఇప్పుడు ఆ లోటు తీర్చేసారు, మత ప్రబోధకుడు కేఎ పాల్. ఆయన చేసిన ట్వీట్లు చూసి నవ్వుకోవడం మినహా మరేం చేయనక్కరలేదు.
''..దేవుడిచ్చిన టాలెంట్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో వుంటారు. ఆఫ్ కోర్స్ నేను కూడా..''
'..విద్యా మంత్రిత్వశాఖ కచ్చితంగా జలీల్ ఖాన్ కే ఇవ్వాలి. ఈ విషయంలో అతనికి సాటి మరొకరు లేరు..''
'..ఎండతో తల్లడిల్లుతున్న హైదరాబాద్ ను ఆశీర్వదించాను. ఇప్పుడు వర్షం కురిసింది..''
''..పాలిజమ్ ను పవనిజంతో పోల్చకండి. అది ప్రాంతీయం. నాది విశ్వవ్యాప్తం..''
'..నారా లోకేష్.. నీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాలేకపోయాను. నా విమానానికి మరమ్మత్తు వచ్చింది. గాడ్ బ్లెస్ యూ..''
''..బండ్ల గణేష్ నువ్వు ట్రంప్ తో ఫొటో దిగొచ్చు. కానీ ట్రంప్ నా అపాయింట్ మెంట్ తీసుకుంటాడు నాతో ఫొటో దిగడానికి..''
''..లోకికి మూడు పోర్ట్ ఫోలియోలు ఇవ్వడం అంటే ఆరో తరగతి కుర్రాడిని ఐఐటి జెఇఇ పరీక్ష రాయమనడం లాంటిదే..''
ఇలా చాలా వున్నాయ్. పాల్ గారి ట్విట్టర్ అక్కౌంట్లో. మనసారా నవ్వుకోవడానికి బాగానే పనికి వస్తాయ్.