బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ అరెస్టయ్యిందనే వార్త నిన్న మీడియాలో భగ్గుమంది. 'తూచ్, అసలామెని మేం అరెస్ట్ చేయలేదు.. రాఖీసావంత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది..' అంటూ పోలీసులు వివరణ ఇచ్చారు కూడా. మరోపక్క, రాఖీసావంత్ సన్నిహితులు మాత్రం, ఆమె స్వయంగా పోలీసులకు లొంగిపోయిందంటున్నారు. పోలీసులు మాత్రం ఆమెను తాము అరెస్ట్ చేయలేదనీ, ఆమె లొంగిపోయిందంటూ వస్తున్న వాదనల్లోనూ నిజం లేదని తెగేసి చెబుతున్నారు.
ఇంతకీ, రాఖీ సావంత్కి ఏమయ్యింది.? ఆమె ఎక్కడుంది.? ఈ విషయమై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసులు నమోదయినప్పుడు, అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు సెలబ్రిటీలు అజ్ఞాతంలోకి వెళ్ళడం మామూలే. అదే సమయంలో, తమవారి ఆచూకీ దొరకడంలేదని పోలీసులపై అభాండాలు వేస్తూ వారి వారి సన్నిహితులు ఆందోళన చేయడమూ కొత్త విషయం కాదు.! పైగా, అక్కడున్నది రాఖీ సావంత్. ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో ఆమె దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రామాయణ మహా కావ్యాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే, రాఖీసావంత్కి ఇప్పుడు ఈ దుస్థితి ఎదురయ్యింది. దేన్నయినా, పబ్లిసిటీ కోసం వాడేసుకోవడం రాఖీసావంత్కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే మరి, అరెస్ట్ వ్యవహారాన్ని కూడా రాఖీ సావంత్ బీభత్సమైన పబ్లిసిటీ స్టంట్గా మార్చేసింది. ఇంతకీ రాఖీ సావంత్ ఆచూకీ, ఆమె సన్నిహితులకైనా తెలుసా.? ఎన్నాళ్ళని ఆమె అజ్ఞాతంలో వుండగలదు.? పోలీసులూ, ఆమె కోసం వెతుకుతున్నారిప్పుడు కాబట్టి, అతి త్వరలోనే రాఖీ సావంత్ పబ్లిసిటీ స్టంట్కి పోలీసులు తెరదించేయనుండడం ఖాయమే. అన్నట్టు, రాఖ ీసావంత్ ముంబైలోనే తనకు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ ప్రముఖుడి వద్ద ఆశ్రయం పొందుతోందట. అక్కడినుంచే అరెస్ట్ పర్వం నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోందట.