ఈ శనివారం తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు అల్లుఅర్జున్. అయితే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కేవలం బన్నీ బర్త్ డే కోసం మాత్రమే ఎదురు చూడడం లేదు. ఓ సినిమాపై క్లారిటీ కోసం ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అదే వక్కంతం వంశీ సినిమా. బన్నీ పుట్టినరోజు నాడు ఆ మూవీ ప్రారంభం అవుతుందా అవ్వదా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి.
బన్నీ-వక్కంతం సినిమాకు సంబంధించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే పేరు పెట్టారనేది మొదటి ప్రచారం. ఇక రెండో పుకారు విషయానికొస్తే ఈ ప్రాజెక్టులోకి కన్నడ భామ రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ రెండింటికి మించిన మరో రూమర్ కూడా బాగానే చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బన్నీ-వక్కంతం సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడట.
ఇలా రోజుకో పుకారుతో షికారు చేస్తున్న బన్నీ-వక్కంతం సినిమాపై క్లారిటీ రావాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. ఆ రోజున వీళ్లిద్దరి కాంబోలో సినిమా ప్రారంభం కాకపోయినా, కనీసం మూవీకి సంబంధించిన అప్ డేట్స్ తెలిసే అవకాశం ఉంది.