కార్తీ-చెలియా-మణిరత్నం

ఒకప్పుడు కార్తీ సినిమా వస్తోంది అంటే ఆ సందడే వేరు. ఆవారా దగ్గర నుంచి ప్రారంభమైన ఈ సందడి రాను రాను తగ్గుతూవస్తోంది. ఆ మధ్య ఊపిరి సినిమా తెలుగు నాట కార్తీ చరిష్మాకు…

ఒకప్పుడు కార్తీ సినిమా వస్తోంది అంటే ఆ సందడే వేరు. ఆవారా దగ్గర నుంచి ప్రారంభమైన ఈ సందడి రాను రాను తగ్గుతూవస్తోంది. ఆ మధ్య ఊపిరి సినిమా తెలుగు నాట కార్తీ చరిష్మాకు కాస్త ఊపిరి పోసింది. ఆ తరువాత వస్తున్న సినిమా చెలియా. ఈ సినిమాకు చాలా అడ్వాంటేజ్ లు వున్నాయి. దిల్ రాజు నిర్మాత, మణిరత్నం దర్శకుడు. కానీ ఈ కాంబినేషన్ తగినంత బజ్ మాత్రం కనిపించడం లేదు.

చెలియా ట్రయిలర్లు, టీజర్లు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ లో కాస్త ఆసక్తి కలిగించాయి అనుకోవడమే కానీ, అది కూడా ఎంత వరకు వాస్తవమన్నది ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే తప్ప చెప్పే పరిస్థితి లేదు. ఈ సినిమా బజ్ మాత్రం బి, సి సెంటర్లకు ఇంకా చేరలేదు. అయితే నిర్మాత దిల్ రాజు హోప్ అంతా ఒక్కటే. ఓవర్ సీస్, అర్బన్ ఆడియన్స్ సరిపోతారు ఆ సినిమా బడ్జెట్ కు అని. 

అయితే వారం తిరక్కుండా మాస్ సినిమాలు రెండు మూడు వచ్చేస్తున్నాయి. ఎక్కువ థియేటర్లలో విడుదల చేసినా, ఖర్చులు ఎక్కువై షేర్ తక్కువవుతుంది. తక్కువ థియేటర్లు ఇస్తే, కాస్త డబ్బులు కళ్ల చూసేలోగా వారం గడిచిపోతుంది. 

నిజానికి ఇది మణిరత్నం సినిమాగానే పబ్లిసిటీ సాగుతోంది. పైగా చెలియా అనే క్లాస్ నేమ్. కార్తీ సినిమా అనే విధంగా జనంలోకి వెళ్తే బజ్ మరి కాస్త వస్తుందేమో? ఏదయినా చెలియా క్రౌడ్ పుల్లింగ్ అన్నది సినిమా విడుదల తరువాత పరిస్థితి మీదేనే ఆధారపడి వుంది.