ఎన్టీఆర్ కు నత్తి?

ఇప్పుడు హీరోలందరూ వైవిధ్యమైన పాత్రల వెంట పడుతున్నారు. రామ్ చరణ్ తను సుకుమార్ తో చేస్తున్న సినిమాలో కాస్త చెముడు వున్న పాత్ర చేస్తున్నాడు. రవితేజ, రాజ్ తరుణ్ తమ తమ సినిమాల్లో అంధుల…

ఇప్పుడు హీరోలందరూ వైవిధ్యమైన పాత్రల వెంట పడుతున్నారు. రామ్ చరణ్ తను సుకుమార్ తో చేస్తున్న సినిమాలో కాస్త చెముడు వున్న పాత్ర చేస్తున్నాడు. రవితేజ, రాజ్ తరుణ్ తమ తమ సినిమాల్లో అంధుల పాత్రను పోషిస్తున్నారు. టాప్ హీరోల్లో ఒకడైన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు కాస్త వైవిధ్యమైన పాత్రను తన జయ్ లవ కుశ సినిమాలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పెద్దవాడైన జయ్ పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్ వుంటుంది. ఈ పాత్రకు కాస్త నత్తిని మేనరిజమ్ గా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే తండ్రి (పోసాని)కి ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురు పిల్లల కథే జయ్ లవ కుశ అని గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు పిల్లలు అంటే పెద్దవాడికి కిట్టదని, ఈ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. 

నటనకు అవకాశం వున్న పాత్ర దొరికితే విశ్వరూపం చూపించేస్తాడు ఎన్టీఆర్. అలాంటిది కాస్త నెగిటివ్ షేడ్. కాస్త నత్తి అంటే ఇక చెలరేగిపోతాడేమో?