క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాని రాజమౌళి ఇంతకుముందు ఏ సినిమాకీ డెడ్‌లైన్ మీట్ అవలేదు. లాస్ట్ మినిట్ కరక్షన్స్ అతని చిత్రాలకి జరగడం ఖాయం కనుక రిలీజ్ డిలే అవుతుండేది. అయితే తన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రమైన బాహుబలి 2ని మాత్రం అనుకున్నట్టుగా ఏప్రిల్ 28నే రిలీజ్ చేస్తున్నాడు.
భారీ రేట్లు పెట్టి ఈ చిత్రం హక్కులు తీసుకున్నవారంతా ఖచ్చితంగా వేసవిలోనే సినిమా విడుదల చేయాలని కండిషన్ పెట్టారట. ఇంత పెద్ద మొత్తం రికవర్ కావాలంటే చాలా సెలవులు కావాలని, వేసవి తప్ప మరో బెస్ట్ టైమ్ లేదని చెప్పారట. దాంతో ఏప్రిల్ 28కి రిలీజ్ చేయడం కోసం రాజమౌళి లాస్ట్ మినిట్ కరక్షన్ల జోలికి పోవడం లేదట.
గ్రాఫిక్స్ పరంగా విపరీతమైన శ్రద్ధ తీసుకునే రాజమౌళి, ఇటీవల వస్తోన్న ఇతర చిత్రాల్లోని గ్రాఫిక్స్ క్వాలిటీని బట్టి బాహుబలి తారాస్థాయిలో వుంటుందనే భావనతో మరీ రుద్దడం లేదట. అవుట్‌పుట్ బాగుందనిపిస్తే ఇక వంకలు పెట్టకుండా ఓకే చేసేస్తున్నారట. ఇదివరకు అయితే జక్కన్న చెక్కకుండా వుండడానికి నో అనేవాడేమో కానీ ఇప్పుడు ఈ సినిమాపై పెట్టిన కోట్ల పెట్టుబడితో తన పద్ధతులు మార్చుకోక తప్పలేదట మరి.