పవన్ సినిమాకు సక్సెస్ టూర్ నా?

హతవిధీ..ఇలాంటి మాట వినాల్సి వస్తుందని ఎన్నడైనా అనుకున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ వున్న హీరో. డైహార్డ్ ఫ్యాన్స్ వున్నారు. వాళ్లే పవన్ పొలిటికల్ టూర్ కు కూడా…

హతవిధీ..ఇలాంటి మాట వినాల్సి వస్తుందని ఎన్నడైనా అనుకున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ వున్న హీరో. డైహార్డ్ ఫ్యాన్స్ వున్నారు. వాళ్లే పవన్ పొలిటికల్ టూర్ కు కూడా బలం. కాబోయే సిఎమ్ అని నినాదాలు చేస్తున్నారు. సిఎమ్ కావాల్సిందే అని తీర్మానిస్తున్నారు. అలాంటి టాప్ హీరో పవన్ సినిమాకు సక్సెస్ టూర్ చేస్తారా?

సక్సెస్ టూర్ లు రెండు రకాలు. సినిమా సక్సెస్ అయిన తరువాత చేసేవి. సినిమా సక్సెస్ కోసం చేసేవి. సినిమా యావరేజ్ అనుకున్నా, అంతగా లేదనుకున్నా సక్సెస్ టూర్ లు చేస్తుంటారు. సినిమాను లేపే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న సినిమా పెద్ద సక్సెస్ అయినా సక్సెస్ టూర్ లు చేస్తారు. సామజవరగమన సినిమా ఇలాంటిదే.

కానీ పవన్ లాంటి టాప్ రేంజ్ హీరోల సినిమాలకు థియేటర్ టూర్ లు చేయరు. అది చిన్నతనంగా వుంటుంది. కానీ ఇప్పుడు బ్రో సినిమా యూనిట్ ఆలోచన వేరుగా వుంది. మంగళవారం నుంచి సక్సెస్ టూర్ పేరుతో థియేటర్లు తిరిగితే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారు.

విడుదలకు ముందు ఆలయాల టూర్ పేరుతో కొన్ని ఊళ్లు తిరగనే తిరిగారు. ఇప్పుడు మళ్లీ ఇది కొత్త ఆలోచన అన్నమాట. సాధారణంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలు చెప్పే అతి సులువైన, రొటీన్ అయిడియా ఏమిటి అంటే థియేటర్ టూర్ లేదా కాలేజీల టూర్ దీని వల్ల డబ్బులు ఖర్చు తప్ప పైసా ఉపయోగం లేదని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. పవన్ లాంటి పెద్ద హీరో సినిమాకు ఇలాంటి ఔట్ డేటెడ్ ఐడియా తీసుకోవడం ఏమిటో?