బిజినెస్ లోకి సుకుమార్ ఫ్యామిలీ

దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి. అవకాశం వున్నపుడే ఏదో వ్యాపారం చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. ఇప్పడు ఇదే సూత్రాన్ని టాలీవుడ్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు. మాంచి సినిమాలతో ఏస్…

దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి. అవకాశం వున్నపుడే ఏదో వ్యాపారం చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. ఇప్పడు ఇదే సూత్రాన్ని టాలీవుడ్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు. మాంచి సినిమాలతో ఏస్ డైరక్టర్లలో ఒకరయ్యారు సుకుమార్. అయితే డైరక్షన్ తో పాటు సినిమాల నిర్మాణం కూడా ప్రారంభించారు. అక్కడ విజయం నమోదు చేసారు. ముందుకు వెళ్తున్నారు.

అయితే ఇప్పడు సుకుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఫ్యామిలీ మెంబర్లు, కొంతమంది స్నేహితులు కలిసి కార్పొరేట్ లెవెల్ లో డ్రై క్లీనింగ్ ఇండస్ట్రీ కాస్త భారీగా స్టార్ట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి నానక్ రామ్ గూడలో ప్లాంట్ భారీగా కనస్ట్రక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

డ్రయ్ క్లినింగ్ అంటే ఏదో చిన్న చితకా లెవెల్ కాదన్నమాట. రైల్వేస్, హోటల్స్, హాస్పిటల్స్ లాంటి భారీ క్లయింట్ లను తీసుకుంటారని వినికిడి. మొత్తంమీద భారీ టర్నవర్ వుంటుందట. ప్రస్తుతం సుకుమార్ ఓ సినిమా డైరక్ట్ చేస్తున్నారు. ఓ సినిమా నిర్మిస్తున్నారు.