సాయి ధరమ్ తో పవన్ సినిమా?

రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటి దాకా అది మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇదిలా వుంటే రెండు మీడియం రేంజ్ సినిమాలు…

రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటి దాకా అది మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇదిలా వుంటే రెండు మీడియం రేంజ్ సినిమాలు చేయడానికి పవన్ సన్నిహితుడు, నిర్మాత శరద్ మురార్ ఆలోచనలో వున్నారు. ఒకదానికి హీరో ఫిక్సయిపోయాడు. విజయ్ దేవర కొండ హీరో. కానీ ఇంకా డైరక్టర్, సబ్జెక్ట్ ఫిక్స్ కావాలి.

ఇదిలా వుంటే ఇదే మాదిరిగా మరి కొన్ని మీడియం సినిమాలు చేయాలన్నది ఆ బ్యానర్ ఆలోచన. అందులో భాగంగానే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజకు సరిపడే సబ్జెక్ట్, డైరక్టర్ కోసం కూడా చూస్తున్నారు. ఎవరైనా కొత్త,లేదా ఒకటి రెండు సినిమాలు చేసిన టాలెంటెడ్ దర్శకులతో కాటమరాయుడు విడుదల తరువాత డిస్కషన్లు స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నారు.

సాయి ధరమ్ తేజకు సరైన సినిమా ఇవ్వాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాయి ధరమ్ చేతిలో ఒక్క సినిమా మాత్రమే వుంది. విన్నర్ ఫలితం తరువాత కాస్త వైవిధ్యమైన సినిమాల వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. పైగా సాయి ధరమ్ వెనుక పవన్ సలహాలు సూచనలు వుంటున్నాయన్నది ఇండస్ట్రీ గుసగుస. అందుకే పవన్ తన సన్నిహితుడి బ్యానర్ లో ఓ మాంచి ప్రాజెక్టు సెట్ చేసే ఆలోచనలో వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.