ఇంతకీ నాగ్‌ ఎలా డీల్‌ చేస్తాడు.!

'అఖిల్‌' సినిమా ఫ్లాపయ్యిందని ఒప్పుకోడానికి నాగార్జున చాలా ఇబ్బంది పడ్డాడు. నిజానికి ఆ సినిమాకి నాగార్జున తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలిసినిమాతోనే కుమారుడు అఖిల్‌ సూపర్‌ హిట్‌ కొట్టాలనే కసితో,…

'అఖిల్‌' సినిమా ఫ్లాపయ్యిందని ఒప్పుకోడానికి నాగార్జున చాలా ఇబ్బంది పడ్డాడు. నిజానికి ఆ సినిమాకి నాగార్జున తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలిసినిమాతోనే కుమారుడు అఖిల్‌ సూపర్‌ హిట్‌ కొట్టాలనే కసితో, నాగార్జున అన్నీ దగ్గరుండి చూసుకునేందుకు ప్రయత్నించాడు. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళింది మొదలు, విడుదలయ్యేదాకా.. ఆ సినిమాపై నాగార్జున చాలా ఫోకస్‌ పెట్టిన మాట వాస్తవం. అఫ్‌కోర్స్‌, అన్ని సందర్భాల్లోనూ నాగార్జున 'పెత్తనం' కుదరలేదనుకోండి.. అది వేరే విషయం. 

గ్రాఫిక్స్‌ విషయంలో అయితే నాగార్జున చాలా చాలా అసహనం వ్యక్తం చేశాడు. దాంతో, కొన్నాళ్ళు సినిమా విడుదల ఆలస్యమయ్యింది. అయినా, సినిమా ఫేట్‌ మార్చలేకపోయింది. అదంతా గతం. ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు అఖిల్‌ పెళ్ళి వ్యవహారం కూడా సస్పెన్స్‌లో పడిందంటూ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. సినిమాల్లో అఖిల్‌ని రీ-లాంఛ్‌ చేసినంత తేలిక కాదు, అఖిల్‌ పెళ్ళి రగడపై స్పందించడం. అందుకే, నాగార్జున లోలోపల చాలా టెన్షన్‌ పడాల్సి వస్తోంది. నాగ్‌ పూర్తిగా తేరుకుంటేనేగానీ, ఆయన నుంచి ఈ మొత్తం తతంగంపై ఓ ప్రకటన రాకపోవచ్చు. ఈలోగా నాగ్‌ చెయ్యాల్సినన్ని ప్రయత్నాలూ చెయ్యకుండా వుండరు. 

అఖిల్‌ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఎవరి మాటా వినడనీ, అదే సమయంలో పూర్తిగా నిలకడ లేని మనిషి అనీ సినీ పరిశ్రమలో ఇప్పటికే ఓ బలమైన భావన వుంది. సినిమాల ఎంపికలో అఖిల్‌ తడబాటే అందుకు నిదర్శనం. వైవాహిక జీవితానికి సంబంధించి కూడా అఖిల్‌ అదే తీరు ప్రదర్శిస్తుండడమే ఇక్కడ ఆశ్చర్యకరం. ఓ వైపు అఖిల్‌ బదనాం అవుతుండడం, ఇంకోపక్క శ్రియా భూపాల్‌పైనా రకరకాల గాసిప్స్‌ వస్తుండడం.. ఇవన్నీ ఇరు కుటుంబాలకీ ఇబ్బందికరమే. బహుశా ఇలాంటి సందర్భమొకటి వస్తుందని నాగార్జున ఊహించి వుండడేమో.! ఈ క్లిష్ట పరిస్థితుల్ని నాగ్‌ ఎలా డీల్‌ చేస్తాడో వేచి చూడాల్సిందే.