వంగవీటి రంగ పై మరో సినిమా

రామ్ గోపాల్ వర్మ వంగవీటి పేరుతో బెజవాడ రాజకీయాలను, వంగవీటి రాధా, రంగాల కథను తెరకెక్కించిన హడావుడి సద్దుమణిగింది. ఇప్పుడు మరో బ్యానర్ అదే పనికి పూనుకుంటోంది. పైకి నేరుగా ఇది రంగా జీవితచరిత్రపై…

రామ్ గోపాల్ వర్మ వంగవీటి పేరుతో బెజవాడ రాజకీయాలను, వంగవీటి రాధా, రంగాల కథను తెరకెక్కించిన హడావుడి సద్దుమణిగింది. ఇప్పుడు మరో బ్యానర్ అదే పనికి పూనుకుంటోంది. పైకి నేరుగా ఇది రంగా జీవితచరిత్రపై సినిమా అని చెప్పడం లేదు కానీ, టైటిల్ లోగో చూస్తేనే ఆ విషయం అర్థం అయిపోతోంది. రణరంగం పేరిట తయారయ్యే ఈ సినిమా టైటిల్ లోగోలో రంగ అన్న అక్షరాలను వేరే కలర్ తో సెపరేట్ చేసారు. ఈ సినిమా ను నిర్మిస్తున్నది ఎవరో కాదు, ఓ చిన్న న్యూస్ చానెల్ అధినేత, కాపునాడు తుని సంఘటనలో విచారణను ఎదుర్కొన్న మంచాల సాయి సుధాకర్. 

..'ప్రజల అభిష్టం మేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూపనున్నాం. ఈ చిత్రం పేరు 'రణరంగం'. ఈ చిత్రం షూటింగ్‌ని ఆంధ్రా, తెలంగాణలతో పాటు విదేశాల్లో కూడా షూటింగ్‌ జరపనున్నాం. దీనికి కారణం ఏమిటంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ అభిమానుల కోరిక మేరకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాము అని నిర్మాత చెప్పారంటేనే అర్థం అయిపోతోంది ఇది రంగా కథే అని.