ఎక్కడ టాలెంట్ వుందో, ఎవరి దగ్గర మంచి స్క్రిప్ట్ వుందో గాలించడం అన్నది నిర్మాత దిల్ రాజుకు నిత్య కృత్యం. ఇప్పుడు ఆ విధంగానే ఓ దర్శకుడికి చాన్స్ దొరకుతోందని తెలుస్తోంది. అలా ఇలా అంటూ ఓ చిన్న సినిమా తీసి హిట్ కొట్టాడు దర్శకుడు అనీష్ కృష్ణ.
ఆ తరువాత మళ్లీ సరైన సినిమా పడలేదు. అదిగో చాన్స్..ఇదిగో చాన్స్..అంటూ వార్తలే తప్ప, సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు టైమ్ వచ్చింది. అతను చెప్పిన లైన్ దిల్ రాజుకు నచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నేను లోకల్, ఓం నమో వేంకటేశాయ పనుల్లో బిజీగా వున్న దిల్ రాజు కాస్త ఫ్రీ కాగానే ఈ ప్రాజెక్టు ఫైనల్ అవుతుంది. హీరో ఎవరన్నది కూడా ఓ అయిడియా అనుకున్నారు కానీ, ఇంకా ఫైనల్ కావాల్సి వుంది.