నితిన్ ఆ సినిమా కూడా డవుటా?

నితిన్ హీరోగా పవన్-త్రివిక్రమ్ లాంటి బడా సినీ జనాల సమర్పణలో కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్, పవన్ రూపాయి పెట్టేది లేదు కానీ, వారి పేర్లు వాడుకుంటే సినిమాకు…

నితిన్ హీరోగా పవన్-త్రివిక్రమ్ లాంటి బడా సినీ జనాల సమర్పణలో కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్, పవన్ రూపాయి పెట్టేది లేదు కానీ, వారి పేర్లు వాడుకుంటే సినిమాకు బజ్ వస్తుంది కాబట్టి ఈ ప్లాన్ వేసారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

కథ పక్కాగా సెట్ కాలేదని, అందువల్లే ఆ సినిమాను ప్రస్తుతానికి అలా ఆపారని వినికిడి. ప్రస్తుతం నితిన్ ఓ సినిమాను హను రాఘవపూడి డైరక్షన్ లో చేస్తున్నాడు. దాని తరువాత నిర్మాత రాధా మోహన్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. బహుశా ఈ రెండింటి తరువాతే కృష్ణ చైతన్య సినిమా వుంటుందేమో?

ఒక పక్క కథ పక్కాగా రెడీ కాలేదు. మరోపక్క నితిన్ స్వంత బ్యానర్ కు ఫండ్స్ కూడా కాస్త ఇబ్బందిగానే వుంది. అందువల్ల కృష్ణ చైతన్య సినిమా కాస్త ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.