శృంగార కళలో ఆ టెక్నిక్ మహత్యమెంతో!

శృంగారం ఒక కళ. ఈ అంశం గురించి శోధించినంత, పరిశోధించినంతగా మనిషి మరే అంశం గురించి కూడా పరిశీలించి ఉండడేమో! ఎందుకంటే.. ఈ విషయంలో అందరూ పరిశోధకులే! మరి ఇలాంటి పరిశోధనలను పరిశీలించి చూస్తే..…

శృంగారం ఒక కళ. ఈ అంశం గురించి శోధించినంత, పరిశోధించినంతగా మనిషి మరే అంశం గురించి కూడా పరిశీలించి ఉండడేమో! ఎందుకంటే.. ఈ విషయంలో అందరూ పరిశోధకులే! మరి ఇలాంటి పరిశోధనలను పరిశీలించి చూస్తే.. ఆసక్తికరమైన థియరీలు వినిపిస్తూ ఉంటాయి. అంతిమంగా గొప్ప శృంగారానుభవం పొందడానికి ఈ థియరీలు నిర్దేశం చేస్తూ ఉంటాయి.

సెక్సాలజిస్టులు, సెక్సాలజీ పరిశోధకులు బోలెడన్ని థియరీలు చెబుతూ ఉంటారు. ఈ పరంపరలో యూకే పత్రిక డైలీస్టార్ ప్రచురించిన ఒక అధ్యయనం ఆసక్తికరంగా ఉంది. శృంగార సంతృప్తికి 'కీ' ఎక్కడుంది? అంటే ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాన్ని సమాధానంగా ఇస్తోంది ఈ అధ్యయనం. 

అదేమనగా.. శృంగారస్వాధనకు మీ చూపే కీ అని పరిశోధకులు చెబుతున్నారు! అవును.. శృంగార సంతృప్తికి దోహనం చేసే అంశాల గురించి చెప్పమంటే లైంగిక అవయవాల సైజ్ల గురించి, ఫోర్ప్లేల గురించి చెప్పడం గురించి కాదు, శృంగారానికి మంత్రం ఐ కాంటాక్ట్లోనే ఉంది అని ఈ అధ్యయనం చెబుతోంది.
ప్రత్యేకించి స్త్రీలో శృంగార స్పందనలు రేకెత్తించడంలో ఐ కాంటాక్ట్ క్రియాశీలపాత్ర పోషిస్తుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అనేక మంది స్త్రీల నుంచి సేకరించిన అభిప్రాయాలను బట్టే ఈ విషయాన్ని చెబుతున్నామని వివరించారు.

 ''అతడు సూటిగా తమ కళ్లలోకి చూసే చూపుతోనే మధురమైన ఆనందం మొదలవుతుంది.. జంటగా ఇద్దరూ కలిసి విహరిస్తున్న వేళ కానీ, గదిలో సన్నిహితంగా ఉండే క్షణాల్లో అయినా.. చూపే మత్తు చల్లుతుంది..'' అనే భావనను అనేక మంది మహిళలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 

ప్రాక్టికాలిటీగా మహిళల అనుభవాలను తీసుకుని కూర్చిన ఈ సర్వేను శాస్త్రీయమైన పరిశోధకులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇది నిజమే అని చెబుతున్నారు. చూపుల్లో హాట్నెస్, రొమాన్స్ ఉండటం నిజమే అని చెబుతున్నారు. పార్ట్నర్ ఆమె కళ్లలోకి సూటిగా చూసినప్పుడు మెదడు నుంచి ప్రతి స్పందనలు ఉంటాయని, ఫలితంగా ఆమె సెక్సువల్ యాక్టివిటీకి మానసికంగా సిద్ధం అవుతుందని వీరు చెబుతున్నారు.

 ప్రేమించుకునే వాళ్లు ఒకరినొకరు చూసుకొంటూ ఆనందించినట్టుగానే, కళ్లలోకి కళ్లు పెట్టిచూడటంలో శృంగారాస్వాధనకు కూడా సంబంధం ఉందని వివరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. శృంగార సంతృప్తిలో ఫోర్ప్లే కన్నా, ఐ కాంటాక్టే గొప్పపాత్ర పోషిస్తుందని వీరు తేల్చి చెబుతున్నారు!