నాగశౌర్య ఎక్కడ?

చకచకా సినిమాలు చేస్తూ వచ్చిన హీరో నాగశౌర్య ఒక్కసారిగా గాయబ్ అయ్యారు. కళ్యాణ్ వైభోగమే, జ్యో అచ్చుతానంద లాంటి రెండు హిట్ లు ఇచ్చిన తరువాత మరి సినిమా ఏదీ పట్టాల మీదకు వెళ్లలేదు.…

చకచకా సినిమాలు చేస్తూ వచ్చిన హీరో నాగశౌర్య ఒక్కసారిగా గాయబ్ అయ్యారు. కళ్యాణ్ వైభోగమే, జ్యో అచ్చుతానంద లాంటి రెండు హిట్ లు ఇచ్చిన తరువాత మరి సినిమా ఏదీ పట్టాల మీదకు వెళ్లలేదు. అలా అని సినిమాలు చేతిలో లేవా అంటే వున్నాయి.

సుకుమార్, సాయి కొర్రపాటి లాంటి నిర్మాతల అడ్వాన్స్ లు వున్నాయి. కానీ సుకుమార్ దర్శకుడు సినిమాతో, చరణ్ సినిమాతో బిజీగా వున్నారు. సాయి కొర్రపాటి అనుకున్న కథ సరిగ్గా రాక ఆ సినిమా ఆపేసారు. దీంతో నాగశౌర్య కెరీర్ కు ఒక్కసారి బ్రేక్ వచ్చేసింది. 

పైగా ఇప్పుడు ఈ రేంజ్, ఏజ్ హీరోల నడుమ పిచ్చ కాంపిటీషన్ వుంది. అందువల్ల సరైన ఓపెనింగ్స్ రాబట్టగలిగిన వారి దగ్గరకే నిర్మాతలు, డైరక్టర్లు క్యూ కడుతున్నారు. దీంతో నాగశౌర్య కాస్త బ్రేక్ తీసుకోక తప్పినట్లు లేదు.