సమంత అక్కడ-రాశీ ఇక్కడ ఫిక్స్

రాశీఖన్నా అదృష్టం బాగుంది. హీరో రవితేజ మరోసారి తన సరసన చాన్స్ ఇచ్చాడు. మళ్లీ మరో చాన్స్ రాశీఖన్నా కొట్టేసింది అనుకుంటుంటే, ఇప్పుడు ఇంకో చాన్స్ కూడా దొరికినట్లే అని తెలుస్తోంది. యంగ్ టైగర్…

రాశీఖన్నా అదృష్టం బాగుంది. హీరో రవితేజ మరోసారి తన సరసన చాన్స్ ఇచ్చాడు. మళ్లీ మరో చాన్స్ రాశీఖన్నా కొట్టేసింది అనుకుంటుంటే, ఇప్పుడు ఇంకో చాన్స్ కూడా దొరికినట్లే అని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కావాల్సిన ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా రాశీఖన్నాను ఆల్ మోస్ట్ ఫైనల్ చేసేసారని వినికిడి. మిగిలిన ఇద్దరు ఎవరన్నది మాత్రమే తేలాలి. ఈ సినిమా షూట్ 11న ప్రారంభవుతుంది. దీనికి బాబీ దర్శకుడు. 

ఇదిలా వుంటే అనుపమ పరమేశ్వరన్ ను తప్పించిన డైరక్టర్ సుకుమార్ సినిమాలో సమంతను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన సమంత నటించడం ఇదే తొలిసారి. ఇటీవల సమంత కు తెలుగులో చిక్కిన పెద్ద ప్రాజెక్టు ఇది. ఇది కాక రాజుగారి గది 2 లో కూడా సమంత నటిస్తోంది.