రాజమౌళి ఎందుకు నాలుక మడతేసారు?

రాజమౌళి లాంటి ఓ నిబద్ధత వున్న దర్శకుడు నాలుక మడతేసాడు. ఇది టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గౌతమీపుత్ర సినిమా అంటే వున్న అభిమానం క్రిష్ అంటే జెలసీగా మారుతోందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.…

రాజమౌళి లాంటి ఓ నిబద్ధత వున్న దర్శకుడు నాలుక మడతేసాడు. ఇది టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గౌతమీపుత్ర సినిమా అంటే వున్న అభిమానం క్రిష్ అంటే జెలసీగా మారుతోందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గౌతమీ పుత్ర శాతకర్ణిపై ఈనాడు పత్రికలో ప్రచురించిన లేఖ వెనుక పెద్ద విషయమే వుందని తెలుస్తోంది.

క్రిష్ ను రాజమౌళి ఇంటర్వూ చేసినపుడు టాలీవుడ్ మీడియా జనాలు చాలా మంది అక్కడే వున్నారట. అంతా అయిపోయాక, ..'..సార్ దీనిని లెటర్ ఫార్మ్ లో కూడా రాసి వేస్తే బాగుంటుంది..' అని యూనిట్ జనాలు అన్నారట. దానికి రాజమౌళి '..మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి..' అన్నారట. అప్పుడు అక్కడే వున్న మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, '…నేను రాసి మీకు పంపుతాను. మీరు ఒకె చేసాక, మీడియాకు ఇస్తాను' అన్నాడట…దానికి రాజమౌళి '..అవసరం లేదు..ప్రోసీడ్..' అని చెప్పి వెళ్లిపోయారట. దీనికి చాలా మంది మీడియా జనాలు సాక్ష్యం వున్నారట ఆ టైమ్ లో. 

మరి ఈనాడు లో వచ్చిన వెంటనే స్పందించకుండా, రాజమౌళి ఎందుకు ఇప్పుడు స్పందించాడు అన్నదానికి రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, పండగకు రెండు సినిమాలు విడుదలైతే, రెండూ హిట్ అయితే, మీరు ఒక్కదాన్నే ఎందుకు మోస్తున్నారన్న క్వశ్చను రాజమౌళి చాలా చోట్ల నుంచి వచ్చిందన్నది ఓ కారణంగా వినిపిస్తోంది. 

మరోపక్క జస్ట్ యాభై కోట్ల ఖర్చుతో అతి తక్కువ రోజుల్లో ఆ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడు దర్శకుడు క్రిష్. బాహుబలికి వందల కోట్లు ఖర్చు చేయించాడు, ఏళ్లు పట్టింది నిర్మాణానికి అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ కామెంట్లు రాజమౌళి మీద ప్రభావం చూపించి, క్రిష్ మీద జెలసీ గా మారుస్తున్నాయోమో అన్నది ఆ గుసగుసలు సారాశం.

మొత్తం మీద మీడియా ముందు అలా మాట్లాడిన రాజమౌళి ఇలా మాట మార్చడమే కాకుండా, బాలయ్య-క్రిష్ లాంటి వాళ్ల సినిమా మీద ఇలా ఓపెన్ గా పరువుతీయడం అంటే వెనుక ఏదో వుందనేది మాత్రం పక్కా అనుకోవాల్సిందే.