కానిస్టేబుల్ కు కష్టాలేనట

ఎంత సీనియార్టీ వున్నా సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు తప్పవు. కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా నిర్మాత కమ్ డైరక్టర్ పరిస్థితి ఇదే. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం వుండి కూడా తమ సినిమాకు రిలీజ్ డేట్…

ఎంత సీనియార్టీ వున్నా సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు తప్పవు. కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా నిర్మాత కమ్ డైరక్టర్ పరిస్థితి ఇదే. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం వుండి కూడా తమ సినిమాకు రిలీజ్ డేట్ విషయంలో తప్పటడుగు వేసారు. పండగ వేళ పెద్ద సినిమాలతో పోటీ పడ్డారు. 

థియేటర్లు దొరకలేదు. దొరికిన చోట పెద్ద సినిమాలు చూసిన కళ్లతో చిన్న సినిమా చూడలేదు. దీంతో తొలివారం కాగానే చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విడుదలైన చోట్ల తీసేయాలా?వుంచాలా? అనే పరిస్థితి. మలివారం పెద్ద సినిమాలు ఖాళీ అయిన చోట్ల థియేటర్లు దొరికే పరిస్థితి. అదే కనుక ఈవారం విడుదల ప్లాన్ చేసి వుంటే చాలా బాగుండేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఈ వారం అస్సలు సినిమా అన్నది విడుదల లేదు. ఖాళీ. ఇప్పుడు వేసుకుంటే థియేటర్లు దొరికేవి, కాస్త జనం చూసేవాళ్లన్నా చూసేవారు. అక్కడే తేడా జరిగిపోయింది. అయితే గుడ్డిలో మెల్ల ఏమిటంటే, జస్ట్ అయిదు కో్ట్లకు లోపు ఖర్చుతోనే సినిమాను ఫినిష్ చేసారు. అందువల్ల శాటిలైట్ కొంతవరకు ఆదుకుంటుంది. ఆపైన ఈ వీక్ ఏమన్నా కొత్త థియేటర్లు ఆదుకుంటే ఆదుకోవచ్చు. లేదంటే కానిస్టేబుల్ కు మూడునాలుగు కోట్ల మేరకు కష్టాలే.