శృంగారస్వాదనకు సరైన వయసు ఎంతంటే..!

టీనేజ్ లోకి అడుగు పెట్టగానే హార్మోన్ల ప్రభావం మొదలవుతుంది.. అలాంటి శృంగార వాంఛకు అంతం ఎప్పుడో చెప్పలేరు. అయితే శృంగారాన్ని ఆస్వాధించడానికి తగిన వయసు ఏదంటే.. మాత్రం చాలా రకాల అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి.…

టీనేజ్ లోకి అడుగు పెట్టగానే హార్మోన్ల ప్రభావం మొదలవుతుంది.. అలాంటి శృంగార వాంఛకు అంతం ఎప్పుడో చెప్పలేరు. అయితే శృంగారాన్ని ఆస్వాధించడానికి తగిన వయసు ఏదంటే.. మాత్రం చాలా రకాల అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి. యువతగా ఉత్తేజంగా ఉన్నప్పుడని కొందరంటారు.. ఎక్కువమంది అభిప్రాయం కూడా అదే. పదిహేడు, పద్దెనిమిదేళ్ల వయసులో.. శృంగారాలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ఆ వయసులో ఉత్సాహం ఉంటుంది కాబట్టి, అవకాశం ఉంటే ఆస్వాధనకు కూడా అదే తగిన వయసునే మాట వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. మెజారిటీ జనాల అభిప్రాయం మాత్రం అది కాదట. హఫింగ్టన్ పోస్టులో ప్రచురితం అయిన అధ్యయనం ప్రకారం.. శృంగారస్వాధనకు ఉత్తమ వయసు 40! నలభైలో పడ్డాకే శృంగారంలో అసలైన మజా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. అనేక మంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలను తీసుకుని చేసిన ఈ అధ్యయనంలో ఈ విషయం తేలిందట. 40లలో శృంగార జీవితం అద్భుతంగా ఉంటుందన్న వారిలో మహిళల శాతం 37 కాగా, పురుషుల శాతం 34. మరి నలభై అంటే దాదాపు మధ్య వయసు.. అప్పటికి పిల్లలు కూడా ఎదిగొస్తూ ఉంటారు, బాధ్యతల టెన్షన్లు ఉంటాయి.. అనుకుంటారు కానీ, శృంగారంతో సేద తీరే వయసు కూడా అదే అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

శృంగారానికి సంబంధించి స్త్రీ పురుషుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ఇంకా రకరకాల అంశాల గురించి సాగింది ఈ సర్వే. అలాగే పోర్న్ వీక్షణ గురించి కూడా. పోర్న్ హబ్ డాట్ కామ్ నుంచి తీసుకున్న డాటా ప్రకారం.. మహిళలు పోర్న్ చూడరు అనేది అబద్ధమని తేల్చింది ఈ అధ్యయనం. పోర్న్ వీక్షణలో స్త్రీల శాతం క్రమంగా పెరుగుతోందని ఆ సైట్ గణాంకాలు చెబుతున్నాయి. 2014లో తమ వీక్షకుల్లో మహిళల శాతం 26 కాగా, 2015కి ఆ శాతం ముప్పైకి చేరిందట. ఇక ఎక్కువ సేపు వీక్షించేది కూడా మహిళలనేట. సగటున పురుషుడు తొమ్మిది నిమిషాల సేపు పోర్న్ ఫిల్మ్స్ చూస్తే .. లేడీస్ యావరేజ్ పదినిమిషాల పైనే ఉందని ఆ సైట్ గణాంకాలను బట్టి తెలుస్తోందట! 

అలాగే పురుషులు ప్రతి ఏడు సెకెనులకూ ఒక సారి సెక్స్ గురించి ఆలోచిస్తారని ఇది వరకూ వేరే అధ్యయన కర్తలు ప్రకటించడం.. ఒట్టి ఫాల్స్ అని పేర్కొన్నారు. అలా ఆలోచిస్తారని అనడం అబద్ధమని తేల్చారు. అదే నిజం అయితే ఒక్కో మగాడు రోజుకు కనీసం 7,200 సార్లు శృంగారం గురించి ఆలోచించాల్సి ఉంటుందన్నారు. అది శుద్ధ అబద్ధ అని మగాడు సగటున రోజుకు 19 సార్లు, స్త్రీలు రోజుకు సగటున పది సార్లు శృంగారం గురించి ఆలోచిస్తారని.. ఒహియో వర్సిటీ రీసెర్చ్ తేల్చిందని, ఇది విశ్వసనీయం అని హఫ్ పోస్టులో పేర్కొన్నారు.