దిల్ రాజు ఇటీవలి కాలంలో రెండు ప్రాజెక్టులపై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు. ఒకటి రోజులు మారాయి. రెండవది శతమానం భవతి. వీటిలో రోజులు మారాయి యూత్ ఫిల్మ్..అది భలేగా ఎక్కేస్తుంది అనుకున్నారు. కానీ సెట్ కాలేదు. రెండవ సినిమా శతమానం భవతి. ఆల్ మోస్ట్ దిల్ రాజు డైరక్ట్ చేసిన సినిమా అని ఇండస్ట్రీలో టాక్. అంతలా టాక్ రావాడానికి కారణం ఆ ప్రాజెక్టులో అంతలా ఇన్ వాల్వ్ కావడమే. షూటింగ్ జరిగినంత కాలం మాగ్జిమమ్ లొకేషన్ లోనే వుండిపోయారు. ఆ సినిమాలో డబ్ స్మాష్ కూడా దిల్ రాజు స్వయంగా ప్లాన్ చేసుకున్నదే అని వినికిడి.
శతమానం భవతికి క్రిటిక్స్ అప్రిసియేషన్ సంగతి ఎలా వున్నా, సినిమా చూసిన తరువాత ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా వున్నా, దాని ఫీల్ గుడ్ విజువల్స్, జరిగిన ప్రచారం అన్నీ కలిసి మాంచి బజ్ ను తీసుకువచ్చేసాయి. అదే ఇప్పుడు దిల్ రాజుకు లక్ గా మారింది. ఈ సినిమాకు అన్నీ కలిపి తొమ్మిది కొట్ల వరకు ఖర్చయింది. సినిమా థియేటర్ రైట్స్ లో నైజాం, విశాఖ వుంచుకుని మిగిలినవి అమ్మేసారు. ఆ అమ్మడం కూడా టోటల్ 11 కోట్ల రేషియో ఫిక్స్ చేసి అమ్మారు. అక్కడికి చాలా వరకు రికవరీ అయిపోయింది. 3.37కు శాటిలైట్ చేసేసుకున్నారు. అంటే టేబుల్ ప్రాఫిట్ తొ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
ఇక ఈ రెండు రోజులకు నైజాం 1.98 కోట్లు, విశాఖ 89 లక్షలు అంటే మూడు కోట్లకు దగ్గరగా వచ్చింది. ఇది శాటిలైట్ కలుపుకుంటేనే అయిదు కోట్ల దాటేసింది. పైగా అమ్మకాల్లో వచ్చిన అమౌంట్. మొత్తం మీద దిల్ రాజు ఈ మధ్య మాంచి లాభం చేసుకున్న ప్రాజెక్టుగా శతమానం భవితి నిలిచేలా వుంది. ఇదిలా వుంటే కొన్న జనాలకు కూడా ఫరవాలేదు అనేలాగే వుంది. రెండురోజుల్లో 5.74 షేర్ వచ్చింది రెండు స్టేట్స్ లో కలిపి. ఈ బజ్ ఆ మాత్రం మరో రెండు రోజులు వుంటే చాలు. ఆ తరువాత లేకున్నా ఫరవాలేదు.