ధోనీకి అంత వీజీ కాదండోయ్‌.!

'ఇంకా నేనే కెప్టెన్‌నని అనుకోవడంలేదుగానీ, కీలకమైన సందర్భాల్లో మునుపటి రోజులు తెలియకుండానే గుర్తుకొచ్చేస్తున్నాయి.. దాంతో మైదానంలో చిన్న చిన్న అపశృతులు మామూలే.. అయితే అవి అంత ప్రమాదకరమైనవేమీ కాదు కదా..' అంటూ సరదాగా నవ్వేశాడు…

'ఇంకా నేనే కెప్టెన్‌నని అనుకోవడంలేదుగానీ, కీలకమైన సందర్భాల్లో మునుపటి రోజులు తెలియకుండానే గుర్తుకొచ్చేస్తున్నాయి.. దాంతో మైదానంలో చిన్న చిన్న అపశృతులు మామూలే.. అయితే అవి అంత ప్రమాదకరమైనవేమీ కాదు కదా..' అంటూ సరదాగా నవ్వేశాడు టీమిండియా మిస్టర్‌ కూల్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. 

మాజీ కెప్టెన్‌ అయినా, మైదానంలో తానింకా కెప్టెన్‌నే అన్నట్లుగా వ్యవహరిస్తూ ధోనీ నిన్న దొరికేశాడు. నిన్నటి వన్డే మ్యాచ్‌లో ధోనీ, 'రివ్యూ' కోరడం అందర్నీ విస్మయానికి గురిచేసిన విషయం విదితమే. అదే సమయంలో, ఆయన తీరు పట్ల నెటిజన్లు సెటైర్లు కూడా షురూ చేసేశారు. ఇంత చిన్న విషయానికే అంత రాద్ధాంతమా.? అంటూ ధోనీ ఒకింత అసహనం వ్యక్తం చేసినా, 'మిస్టర్‌ కూల్‌' కదా, అందుకే ఆ అసహనాన్ని బయటకు రానివ్వడంలేదు. 

క్రికెట్‌లో ఇలాంటివన్నీ మామూలే. మరోపక్క, ఇలాంటి పరిస్థితులు కొత్తమీ కాదంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా లైట్‌ తీసుకున్నాడు. 'ధోనీ మా అందరికీ పెద్దన్న.. ఆయన జట్టులో వున్నంతకాలం ఆయన సలహాల్ని వినియోగించుకుంటూనే వుంటాం.. మా వరకూ మాకు కెప్టెన్‌ ధోనీనే..' అంటూ కోహ్లీ సహా, ధోనీ కెప్టెన్సీలో నిన్న మొన్నటిదాకా పనిచేసిన క్రికెటర్లంతా చెబుతున్నారు. 

మొత్తమ్మీద, ధోనీ కెప్టెన్‌ కాకపోయినా, కెప్టెన్‌ మాత్రమే అడగాల్సిన రివ్యూ కోసం తొందరపడి.. నిన్నటి మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశాన్ని ఆవిష్కరించాడన్నమాట. కెప్టెన్సీకి రాజీనామా చేశాక, ఇదే తొలి మ్యాచ్‌ కదా.! ఆ మాత్రం ఫన్నీ సీన్స్‌ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదు.

ఏదిఏమైనా, టీమిండియాకి సంబంధించినంతవరకు ఎంత కూల్ కెప్టెన్ అనిపించుకున్నా, ఛాలా సందర్భాల్లో మెరుపు వేగంతో స్పందించేవాడు ధోనీ కెప్టెన్సీ పరంగా. ఆ వేగం, కెప్టెన్సీని వదులుకోగానే తగ్గిపోతుందని ఎలా అనుకోగలం.?