విడాకుల జంట.. మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా?

వివాదాస్పద రీతిలో.. అక్రమ సంబంధాలు అంటూ.. వార్తల్లోకి వచ్చిన హృతిక్ రోషన్, సుసానేలు విడాకుల తర్వాత మంచి సన్నిహితులయ్యారు. రాకేష్ రోషన్ తనయుడు హృతిక్, ‘టిప్పుసుల్తాన్’ పాత్రధారి సంజయ్ ఖాన్ తనయ సుసానే. వీళ్లిద్దరూ…

వివాదాస్పద రీతిలో.. అక్రమ సంబంధాలు అంటూ.. వార్తల్లోకి వచ్చిన హృతిక్ రోషన్, సుసానేలు విడాకుల తర్వాత మంచి సన్నిహితులయ్యారు. రాకేష్ రోషన్ తనయుడు హృతిక్, ‘టిప్పుసుల్తాన్’ పాత్రధారి సంజయ్ ఖాన్ తనయ సుసానే. వీళ్లిద్దరూ బాల్య స్నేహితులు. హృతిక్ హీరో అయ్యాకా.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు దశాబ్దం న్నర పాటు ఆదర్శదాంపత్యం కొనసాగించారు. ఇద్దరు పిల్లలు.

ఇలాంటి నేపథ్యంలో వీళ్ల ఇంట మంట రేగినట్టుగా మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అటు హృతిక్ మీద, ఇటు సుసానే మీద వివాహేతర సంబంధాల ఆరోపణలు వచ్చాయి. వీళ్లిద్దరూ వేర్వేరు పార్ట్ నర్లను చూసుకున్నట్టుగా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వాటికి స్పందించలేదు కానీ.. వీళ్లిద్దరూ డైవోర్స్ పిటిషన్ వేశారు. విడాకులు తీసుకుని విడిపోయారు.

అయితే.. అలా విడివిడిగా మారాకా వీళ్లు కలివిడిగా ఉండటం మొదలుపెట్టారు. పిల్లల కోసం తరచూ ఒక చోట చేరుతున్నారు. తమ తమ పుట్టిన రోజులను, తమ పిల్లల పుట్టిన రోజులను.. హాలిడే వెకేషన్లను సరదాగా గడుపుతున్నారు! భారీ ఆర్థిక డీల్ తో విడాకుల తర్వాత కూడా వీళ్లు ఇలా సన్నిహితంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని!

ఇది వరకూ ఒక సారి వివాహం చేసుకుని, విడాకులు తీసుకున్న ఈ జంట.. తిరిగి వివాహంతో ఏకం అవుతోందనే మాట వినిపిస్తోంది. అయితే.. ఈ విషయం గురించి ఆచితూచి స్పందిస్తున్నారు వీళ్లు. హృతిక్ అయితే ఇప్పుడు తను పెళ్లి గురించి ఆలోచించట్లేదని అంటున్నాడు. కెరీర్ మీదే దృష్టి అంటున్నాడు. ఇక సుసానే.. పెళ్లి అన్నట్లేదు కానీ, తామిద్దరం సన్నిహితులమే, మంచి స్నేహితులమే అని అంటోంది. అయినా వీళ్లిద్దరూ తరచూ కనపడుతున్న తీరు.. మాత్రం ఆసక్తిరంగానే ఉంటోంది. భార్యభర్తలుగా ఓడిన వీళ్లు, తల్లిదండ్రులుగా మాత్రం గెలిచారనిపిస్తున్నారు.