పవన్ ‘బ్రో’ ఎక్కడ ఉన్నావ్.. నారాయణపై మాట్లాడవా!

దేశంలోనూ.. తాము నివసించే రాష్ట్రంలోనూ ఆడవారిపై అరాచకాలు జరుగుతున్న పట్టించుకోని చంద్ర‌బాబు అండ్ కో.. ఆంధ్రప్రదేశ్లో ఆడవారిపై ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన గంటల గంటలు టివి డిబేట్‌లు పెడుతూ ఒక పార్టీ ఆఫీస్…

దేశంలోనూ.. తాము నివసించే రాష్ట్రంలోనూ ఆడవారిపై అరాచకాలు జరుగుతున్న పట్టించుకోని చంద్ర‌బాబు అండ్ కో.. ఆంధ్రప్రదేశ్లో ఆడవారిపై ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన గంటల గంటలు టివి డిబేట్‌లు పెడుతూ ఒక పార్టీ ఆఫీస్ నుంచి మరొక పార్టీ ఆఫీసులోకి సోషల్ మీడియా పోస్ట్లు షేర్ చేసుకుంటూ నానా రచ్చ చేసేవారు.. కానీ తమ సామాజిక వర్గం వారు గానీ, తమకు కావాల్సిన వారు గానీ ఎక్కడ ఏ తప్పు చేసినా అదేదో లోక కళ్యాణం కోసం చేసినట్లుగా ఏమీ తెలియనట్లుగా నటించుకుంటూ ఉంటారన్న విషయం మరోసారి చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు నారాయణ విషయంలో మరోసారి బయటపడింది

తన‌ను మాన‌సికంగా, శారీర‌కంగా వేధిస్తున్న‌రంటూ నారాయ‌ణ‌ సొంత త‌మ్ముడి భార్య‌నే ఆయ‌న‌పై అవేద‌న వ్య‌క్తం చేస్తుంటే సామాజిక మీడియాలో వార్త కూడా రాలేదు. ప్ర‌శ్నించ‌డం కోస‌మే పార్టీ పెట్ట‌నంటూ చెప్పుకునే చంద్ర‌బాబు ద‌త్త‌పుత్తుడు క‌నీసం ఫీడీఎఫ్‌లో కూడా ఆ వార్త గురించి మాట్లాడ‌లేదు. మ‌రి ఆయ‌న‌కు పసుపు పార్టీ ఆఫీసు నుండి ఫీడీఎఫ్ రాలేదో ఏమో అంటూ సోష‌ల్ మీడియాలో సెటెర్లు వేస్తున్నారు. ఇన్ని రోజులు బ‌స్సు ఎక్క‌గానే వ‌లంటీర్ల వ‌ల్లే అడ‌వారిపై అఘాయిత్యాలు జ‌రుగుతున్న‌యంటూ వాపోయిన ఆయ‌న నారాయ‌ణపై వ‌చ్చిన వార్త‌ల‌కు కూడా కార‌ణం వ‌లంటీర్ల అంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు.

నారాయ‌ణ స్థానంలో వైసీపీ నాయ‌కులు ఎవ‌రు ఉన్న అంద‌రి కంటే ముఖ్యంగా ప‌సుపు పార్టీ అఫీసు నుండి వ‌చ్చే ఫీడీఎఫ్ నుండి మొద‌టి విమ‌ర్శ‌గా ఎవ‌రిదై ఉంటుంద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే. పార్టీ పెట్టి ప‌ది సంవ‌త్సరాలు అయిన క‌నీసం ఎమ్మెల్యే కూడా ఎందుకు కాలేక‌పోయానంటూ సొంత అభిమానులు అడ‌గ‌డం కాదు. ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు త‌న నుండి ఎందుకు మాట రాదో అనే విష‌యం కూడా ఆయ‌న ప్ర‌శ్నించుకుంటే వ‌చ్చే సారి కాక‌పోయిన ఏదోసారి క‌నీసం తాను గెల‌వ‌క‌పోయిన త‌న పార్టీ నుండి ఎవ‌రో ఒక‌రైన అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉందంటూ ఆయ‌న‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. 

కాగా డెబై ప‌దుల వ‌య‌సులో త‌నపై సొంత కుటుంబ స‌భ్యులే నిందాలు వేస్తుంటే క‌నీసం నారాయ‌ణ‌ వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ఇక్క‌డ విశేషం. మన మీడియా ఉంది మ‌న పార్టీలు ఉన్న‌య‌ని ఆయ‌న కూడా లైట్ తీసుకుంటున్న‌ట్లు ఆర్థం అవుతోంది. ఇక్క‌డ మ‌రో విశేషం ఎంటంటే బీజేపీ నుండి కానీ ఎర్ర పార్టీల నుండి కూడా ఒక చిన్న విమ‌ర్శ కూడా రాక‌పోవ‌డం అశ్చ‌ర్యంగా ఉంది. బ‌హుశా నారాయ‌ణ ఎన్నిక‌ల్లో చేసే సహాయం వ‌ల్ల వారి నుండి మాట రాక‌పోవ‌చ్చు. ఎంతైనా రాజ‌కీయ నాయ‌కుల్లో డ‌బ్బున్న రాజ‌కీయ నాయ‌కులు వేరయా అనేది మ‌రోసారి నిరూపితం అయ్యింది.