కోహ్లీ.. మీడియాపై బ్యాటింగ్‌ అవసరమా.?

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి 'హాలీడేస్‌'ని ఎంజాయ్‌ చేస్తున్నారు.. పుణ్యక్షేత్రాలకు తిరిగేస్తున్నారు.. వీరిద్దరి మధ్యా ఎఫైర్‌ నడుస్తోందని గాసిప్స్‌ వస్తే, అది నాన్సెన్స్‌ అట. అలా చాన్నాళ్ళు 'నాన్సెన్స్‌' అంటూ మీడియాపై నోరు…

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి 'హాలీడేస్‌'ని ఎంజాయ్‌ చేస్తున్నారు.. పుణ్యక్షేత్రాలకు తిరిగేస్తున్నారు.. వీరిద్దరి మధ్యా ఎఫైర్‌ నడుస్తోందని గాసిప్స్‌ వస్తే, అది నాన్సెన్స్‌ అట. అలా చాన్నాళ్ళు 'నాన్సెన్స్‌' అంటూ మీడియాపై నోరు పారేసుకున్న విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ.. చివరికి తమ మధ్య వున్న 'స్నేహాన్ని' కన్‌ఫామ్‌ చేయక తప్పలేదు. అది 'ప్రేమ లాంటిదే కావొచ్చు..' అంటూ ఆ తర్వాత చెప్పారు. చివరికి 'ప్రేమ' అని తేల్చేశారు. 

ప్రేమించుకుంటే, పెళ్ళి చేసుకోవాలి కదా.. ఆ పెళ్ళి ఎప్పుడు.? అనడిగితే, 'ఏం, ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలనే రూల్‌ ఏమన్నా వుందా.?' అని మరోసారి ఈ ఇద్దరూ జోక్‌ పేల్చారిద్దరూ. అలా మీడియా మీద విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేల్చిన సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. అయినాసరే, సెలబ్రిటీలు కదా.. వీరికి సంబంధించిన ఏ న్యూస్‌ అయినా హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది. అలా వీరిద్దరిపైనా గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. 

తాజాగా అనుష్క – విరాట్‌ కోహ్లీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయిందనే గాసిప్‌ పుట్టుకొచ్చింది. కాదు కాదు రెండ్రోజుల్లో.. అనే మరో గాసిప్‌ కూడా తెరపైకొచ్చింది. ఈ గాసిప్స్‌ విరాట్‌ కోహ్లీకి ఆగ్రహం తెప్పించాయి. ఇంకేముంది, బ్యాటింగ్‌ షురూ చేశాడు. అదేనండీ, మీడియా మీద సెటైర్ల బ్యాటింగ్‌. మాకింకా ఎంగేజ్‌మెంట్‌ అవలేదు, ఎంగేజ్‌మెంట్‌ ప్లానింగ్స్‌ ఏమైనా వుంటే, దాచాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడితో ఆగితే అతను విరాట్‌ కోహ్లీ ఎందువుతాడు.? 'మీడియా మా వార్తల్ని అమ్ముకోకుండా వుండలేకపోతోంది..' అంటూ సోషల్‌ మీడియాలో విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలిప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. 

ఎంతైనా, ఈ ఏడాది కోహ్లీ క్రికెటర్‌గా సూపర్‌ ఫామ్‌లో వున్నాడు.. అనుష్క శర్మ సినిమాల్లో సూపర్‌ ఫామ్‌లో వుంది. కాబట్టి, ఈ మాత్రం 'బ్యాటింగ్‌' తప్పదు. తేడా కొడితేనే, అప్పుడు మీడియా గుర్తుకొస్తుంది. ఎనీ డౌట్స్‌.?