ఆదిపురుష్..అగ్నిప్రమాదం..కుట్రనా?

ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ నష్టం వాటిల్లింది. కానీ ఆ వార్త ఆ రోజుతోనే సమసిపోయింది.  Advertisement…

ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ నష్టం వాటిల్లింది. కానీ ఆ వార్త ఆ రోజుతోనే సమసిపోయింది. 

అయితే ఈ అగ్నిప్రమాదం, ప్రమాదం కాదని, కుట్ర దాగి వుందని ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ లో  గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.

సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని మీద ఆది నుంచీ అభ్యంతరాలు రావడం, క్షమాపణలు వగైరా సీన్లు జరిగాయి. అగ్నిప్రమాదం వెనుక సైఫ్ ఆలీఖాన్ రావణ పాత్ర  వ్యవహారం కూడా దాగి వుందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

అయితే యూనిట్ వైపు నుంచి ఈ విషయం మీద అస్సలు స్పందన లేదు. వారు కామ్ గా వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఈ వివాదం కొనసాగాలనుకునే వారు మాత్రం గ్యాసిప్ లు ప్రచారం ఆపడం లేదు.

విల‌న్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నా

షర్మిలపై ఆంధ్రా అనే ముద్ర