కరిష్మా కపూర్… వంశం నేపథ్యం నుంచే వచ్చింది కానీ, ప్రతిభావంతమైన నటి. ఒక దశలో అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చింది. అయితే.. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయ్యింది. సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత పెద్దగా వార్తల్లో నిలవలేదు కరిష్మా. విడాకుల అనంతరం సినిమాల వైపు వచ్చే వాళ్లలా కాకుండా.. చాలా లో ప్రొఫైల్ లోనే గడిపేస్తోంది ఈమె. ఇలాంటి కరిష్మా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తుంది.
ఈమె మళ్లీ ప్రేమలో పడిందని, ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని సమాచారం. అతడి పేరు సందీప్ తోష్నీవల్. అతడితో కలిసి తరచూ కనిపిస్తోంది కరిష్మా. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనేది బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న పుకారు. దీనికి తోడు వీళ్లిద్దరూ ఉన్న సందర్భాల్లో ఫొటోలు కూడా క్లిక్ మన్నాయి. దీంతో పుకార్లకు బలం చేకూరుతోంది.
అయితే తన వ్యక్తిగత జీవితం గురించి కరిష్మా వివరాలను పంచుకోవడానికి ఇష్టపడదు. అదే కరీనా అయితే.. ప్రేమ వ్యవహారాలను దాచుకునేది కాదు. కరిష్మా గుంభనంగా ఉంటుంది. మరి అసలు కథేంటో.. తెలియాలంటే కొంత టైమ్ పడుతుందేమో!