వినోదానికి లోటు లేదు ‘గురు’

క్రీడా నేపథ్యంలో సినిమా, పైగా వెంకీ ఫస్ట్ టైమ్ డిఫరెంట్ మిడిల్ ఏజ్డ్ లుక్, ఇవన్నీ చూసి, గురు సినిమా కాస్త డ్రయ్ గా వుంటుందేమో, రెగ్యులర్ ఆడియన్స్ కు దూరంగా జరుగుతుందేమో అనుకున్నారంతా.…

క్రీడా నేపథ్యంలో సినిమా, పైగా వెంకీ ఫస్ట్ టైమ్ డిఫరెంట్ మిడిల్ ఏజ్డ్ లుక్, ఇవన్నీ చూసి, గురు సినిమా కాస్త డ్రయ్ గా వుంటుందేమో, రెగ్యులర్ ఆడియన్స్ కు దూరంగా జరుగుతుందేమో అనుకున్నారంతా. కానీ ఒక్క టీజర్ తో మొత్తం సినేరియా మారిపోయింది. వెంకీ స్వయంగా పాడిన పాట హమ్మింగ్ తో టీజర్ విడుదలయింది.

పక్కా మాస్ మసాలా గ్రూప్ సాంగ్ బిట్ అది. అక్కడ కూడా వెంకీ తనకు అలవాటైన రెగ్యులర్ స్టెప్స్ కాకుండా, డాస్త డిఫరెంట్ గా ట్రయ్ చేసాడు. దర్శకురాలు సుధ కొంగర అన్ని తరహాల ప్రేక్షకుల గురించి ఆలోచించి, కాస్త కేర్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.

క్రీడానేపథ్యంలో సినిమా అని జనాలకు ఎలాగూ తెలుసు. అందుకే అటు దృష్టి పెట్టకుండా మాస్ జనాలను అలరించే టీజర్ విడుదల చేయడం మంచి అయిడియానే. సంక్రాంతి దాటిన తరువాత ఒకటి రెండు వారాల్లో ఈ సినిమా జనం ముందుకు వస్తుంది.