ఈ గెడ్డాలేమిటి బాబులూ?

ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాలో కాస్త గెడ్డంతో, జనతా గ్యారేజ్ లో భారీ గెడ్డంతొ కనిపించాడు. ఇక ఓం నమో వేంకటేశాయలో నాగ్ కూడా కాస్త గెడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఇక గురులో వెంకీ బ్లాక్ అండ్…

ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాలో కాస్త గెడ్డంతో, జనతా గ్యారేజ్ లో భారీ గెడ్డంతొ కనిపించాడు. ఇక ఓం నమో వేంకటేశాయలో నాగ్ కూడా కాస్త గెడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఇక గురులో వెంకీ బ్లాక్ అండ్ వెైట్ గడ్డంతో దర్శనమివ్వబోతున్నాడు. ఆ మద్య నాగ్ చైతన్య ప్రేమమ్ లో ఇలాంటి లుక్ తోనే తళుక్కున మెరిసాడు. బాహుబలిలో రానాకు కూడా గెడ్డం గెటప్ వుంది. 

వీళ్ల సంగతి ఇలా వుంచితే, హీరో రామ్ ఫుల్ గా గెడ్డం పెంచేసాడు. నాగశౌర్య అయితే చెప్పనక్కరే లేదు. బాగానే పెంచేసాడు. ఈ ఇద్దరూ కూడా గెడ్డం పెంచింది త్వరలో చేయబోయే వారి వారి సినిమాల కోసమే అని తెలుస్తోంది.

శర్వానంద్, నాని ఎప్పుడూ కాస్త లైట్ బియర్డ్ తో వుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో నితిన్ కూడా చేరాడు.అతగాడు కూడా రామ్, నాగశౌర్యల మాదిరిగానే భారీగా గెడ్డం పెంచేసాడు. నితిన్ త్వరలో చేయబోయే సినిమా కోసమే ఈ గెటప్ అని తెలుస్తోంది. ఈ గెటప్ తోనే అఖిల్ పెళ్లి నిశ్చితార్థానికి అటెండ్ అయ్యాడు. 

ఇటీవల నాగ్ అననే అన్నాడు. యంగ్ హీరోలను ఎవర్ని చూసినా గెడ్డాలతో కనిపిస్తున్నారు అని. మరింక ఎంత మంది బాబులు గెడ్డాలతో కనిపిస్తారో?