సినిమాను ఎలా నిలబెట్టుకోవాలో, అల్లు అరవింద్ కు తెలిసినట్లు మరెవరికి తెలియదేమో? తెలిసినా కూడా ఆయనలా చేయడానికి అందరికీ సాధ్యం కాదేమో? ధృవ సినిమా కోసం సైలెంట్ గా పావులు కదిపి సూర్య సింగం సినిమాను వన్ వీక్ వెనక్కు జరిపారు. ఆంధ్రలో సింగం సమస్య తీరింది. చెన్నయ్ బోర్డర్ లో కూడా సమస్య తీరింది.
కానీ అన్నింటికన్నా కీలకం బంగళూరులో థియేటర్లు. అందుకే అక్కడా చక్రం తిప్పేసారని వినికిడి. తొమ్మిదిన విడుదల కావాల్సిన 'సుందరంగ జాణ' సినిమాను కూడా విజయవంతగా వెనక్కు పంపేసారు. ఈ సినిమా ఏదో కాదు. మన తెలుగు సినిమా భలే భలే మగాడివోయ్ కు కన్నడ రీమేక్. దీని నిర్మాణంలో అల్లు అరవింద్ భాగస్వామి. మరో భాగస్వామి రాక్ లైన్ వెంకటేష్.
కన్నడ నాట కాస్త ఫాలోయింగ్ వున్న గణేష్ హీరో. ఈ సినిమా 9న విడుదల కావాల్సి వుంది. కానీ ఇప్పుడు అది కూడా 23 కు వాయిదా పడింది. దీ అరవింద్ చాణక్యం.