'నాకు పెళ్ళి ఎన్నిసార్లు, ఎంతమందితో చేసేస్తారు.. పెళ్ళి ఆలోచన వుంటే నేనే చెప్తాను కదా.. అదేమీ సీక్రెట్ మెయిన్‌టెయిన్ చెయ్యాల్సిన విషయం కానే కాదు..' అంటూ తాజాగా నయనతార తన మీద వస్తోన్న గాసిప్స్‌పై స్పందించింది.
నిజానికి నయనతార మీద గాసిప్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నవేమీ కాదు. గతంలో శింబుతో నయనతార ఎఫైర్ నడుపుతున్న కాలంలోనూ వచ్చాయి. ఆ గాసిప్స్‌ని నిజం చేస్తూ, శింబు – నయనతార క్లోజ్‌గా వున్న కొన్ని ఫొటోలు వెలుగు చూశాయి. 'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం..' అని నయనతార స్వయంగా ప్రకటించింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం అందరికీ తెల్సిన విషయమే. ఆ తర్వాత ప్రభుదేవాతో ఎఫైర్. అదెంత వివాదాస్పదమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార 'స్నేహం' కొనసాగిస్తోంది. అది ప్రేమగా మారి, ఇద్దరూ సహజీవనం చేసేదాకా వెళ్ళిందన్నది తాజా గాసిప్స్ సారాంశం. నయనతార మాత్రం షరామామూలుగానే, ఇదంతా హంబక్.. అని కొట్టిపారేస్తోంది. 'ఒకప్పుడు శింబు స్నేహితుడు, ఆ తర్వాత ప్రభుదేవాతో స్నేహం చేశా, ఇప్పుడు విఘ్నేష్ శివన్‌తో.. ఏం, నాకు స్నేహితులు వుండకూడదా.?' అంటూ అమాయకంగా ప్రశ్నిస్తోంది నయనతార.
స్నేహం వేరు, ప్రేమ వేరు.. ప్రేమ పెటాకులవడం వేరు.. అఫ్కోర్స్ నయనతారకు ఇవేం కొత్త కాదనుకోండి.. అది వేరే విషయం. నయనతార ఎఫైర్స్లానే, ఆమె మాటలూ వెరైటీగా వుంటాయి.. అందుకే, నయనతార రూటే సెపరేటు.