రెండున్నరేళ్ల కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వవాదులు తెరపైకి తెచ్చిన లవ్ జిహాద్ పదం బాలీవుడ్ కే బాగా సెట్ అవుతుందనేది వేరే చెప్పనక్కర్లేదు. హిందుత్వవాదులు ఏ అంశంపై బాగా ఆందోళన వ్యక్తం చేస్తుంటారో బాలీవుడ్ లో ఆ తరహా ప్రేమ వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరంపరలో తాజాగా ఫర్హాన్ అక్తర్, శ్రద్ధా కపూర్ ల ప్రేమ కథ కూడా ఒకటని చెప్పాలి.
ఇప్పటికే కూతురు తీరుతో శక్తి కపూర్ కు తలబొప్పి కట్టిందట. అమ్మాయిని హీరోయిన్ గా నటించడానికి ప్రోత్సహించిన ఆ సీనియర్ నటుడు ఇక్కడ ఈమె చేస్తున్న స్నేహాల పట్ల ఏ మాత్రం ఆనందంగా లేడని సమాచారం. ఓవర్ నైట్ పార్టీలు, అర్ధరాత్రి తర్వాత ఇంటికి రావడం వంటి వ్యవహారాల విషయంలో కూతురుని మందలించడం కూడా జరిగిందట. అవే అనుకుంటే ఇప్పుడు శ్రద్ధ ఫర్హాన్ అక్తర్ తో ప్రేమలో పడింది- కలిసి జీవించడం కూడా మొదలైందనే వార్త ఇప్పుడు బయటి వారిలో చర్చనీయాంశంగా మారింది.
ఫర్హాన్ పెళ్లైన వాడు, విడాకుల ముచ్చటను కూడా పూర్తి చేశాడు. శ్రద్ధ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈమె వెళ్లి అతడిని ప్రేమిస్తోంది, అతడితో సహజీవనం అంటే… చాలా మంది ఈమెపై జాలి పడుతున్నారు! ఇప్పటికే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు.. పెళ్లైన వాళ్ళకు, విడాకులు తీసుకున్న వాళ్లకు దగ్గరయినట్టుగా శ్రద్ధ కపూర్ కూడా వ్యవహరిస్తోందనుకోవాలి. లేదు.. లేదు.. అంటూ ఇంకా ఇప్పుడే ప్రేమకథను సహజీవనంతో పట్టాలెక్కించింది శద్ధా కపూర్. మరి ఈ స్టోరీ ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి!