హీరో గారు.. మరో ఫారెన్ భామతో..!

సల్మాన్ ఖాన్ కన్ను ఇప్పుట్లో పూర్తిగా విదేశీ భామల మీదే దృష్టి ఉన్నట్టుంది. ఇటీవలే ఒక విదేశీ భామతో డేటింగ్ చాప్టర్ ముగియగా.. ఇప్పుడు మరో విదేశీ భామతో ఇతడి ప్రేమాయణం మొదలైందనే మాట…

సల్మాన్ ఖాన్ కన్ను ఇప్పుట్లో పూర్తిగా విదేశీ భామల మీదే దృష్టి ఉన్నట్టుంది. ఇటీవలే ఒక విదేశీ భామతో డేటింగ్ చాప్టర్ ముగియగా.. ఇప్పుడు మరో విదేశీ భామతో ఇతడి ప్రేమాయణం మొదలైందనే మాట వినిపిస్తోంది. దక్షిణాదికి బాగా పరిచయం ఉన్న హీరోయిన్ తో సల్లూ  డేటింగ్ చేస్తున్నడనేది ఇక్కడ మరింత ఆసక్తికరమైన అంశం. 

ఆ భామ మరెవరో కాదు.. అమీ జాక్సన్. ఇప్పటికే పలు దక్షిణాది సినిమాల్లో నటించడంతో పాటు, ప్రస్తుతం ‘2.0’ లో హీరోయిన్ గా నటిస్తోంది అమీ. ఆసక్తిని కలిగిస్తున్న రజనీ-శంకర్ సినిమాలో నటించడం కన్నా.. సల్మాన్ తో ప్రేమాయణాన్ని నడుపుతోందనే వార్తలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది అమీ.

2.0 ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమానికి సల్మాన్ హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో  అమీ, సల్లూల మధ్య సాన్నిహిత్యం పలు రకాలుగా వ్యక్తం అయ్యింది. కేవలం ఇదొకటే కాదు.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనేందుకు పలు రుజువులున్నాయని వీరి సన్నిహితులంటున్నారు.

 మరి ఇప్పటికే సల్మాన్ కు సంబంధించి ఎన్నెన్నో ప్రేమకథలు.. డేటింగ్ కహానీలున్నాయి. ఈ కథ ఎక్కడి వరకూ వెళ్తుందో!