నాని పాపం సీరియస్ లవర్. అందుకే తన లవర్ కు పెళ్లయి పోయినా వెంటపడడం మానలేదట. ఆఖరికి వెళ్లి వెళ్లి ఆ అమ్మాయి ఇంట్లోనే వుండి, మాంచి కామెడీ చేసే పనిలో పడ్డాడట. దాంతో ఆ అమ్మాయి మొగుడు కి కిందా మీదా అవుతోందట.
నానీ లవ్ సీరియస్ నే కానీ, ఈ వార్తను టూ సీరియస్ అనుకోకండి. ఇదంతా నాని త్వరలో చేయబోయే సినిమా లైన్ అంట. అభినందన లా టూ ఎమోషనల్ గా కాకుండా, ఆర్య 2 లో మాదిరిగా టూ స్టయిలిష్ గా కాకుండా, నాని స్టయిల్ లో ఫన్ పండిచే లైన్ ఇది అని తెలుస్తోంది.
ఈ సినిమాలో నాని లవర్ ను పెళ్లి చేసుకునే అబ్బాయిగా ఆది పినిశెట్టి నటించడం విశేషం. సరైనోడులో విలన్ వేసిన ఆది, ఇప్పుడు మళ్లీ మరోసారి మల్టీస్టారర్ లో కనిపించబోతున్నాడు. ఇద్దరు అబ్బాయిుల, ఓ అమ్మాయి టైపు కథ అన్నమాట. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.