ఆల్రెడీ ఐశ్వర్య రాయ్ ను గ్లామరస్ రోల్స్ విషయంలో సపోర్ట్ చేయలేకపోతోంది బచ్చన్ ఫ్యామిలీ. ఆమె నటించిన వాస్తవ సంఘటనల ఆధారిత సినిమాలను, ఆమె చేసిన డీ గ్లామరస్ రోల్స్ ను ప్రమోట్ చేసే సీనియర్ బచ్చన్, జూనియర్ బచ్చన్.. ఆమె హాట్ గా కనిపించిన సినిమా గురించి మాట మాత్రమైన మాట్లాడలేదు!
ఇక జయా బచ్చన్ అయితే.. బాలీవుడ్ సినిమాల్లో పతనం అవుతున్న విలువల గురించి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. అదేమనగా.. అమితాబ్ మనవరాలు నవ్య నవేలీ హీరోయిన్ గా బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుందనేది! అమితాబ్ కూతురు తనయ అయిన నవ్య ఇప్పటికే మీడియా కు పరిచయస్తురాలు. ప్రైవేట్ పార్టీలు, బికినీ పోజులతో ఈ మెగాస్టార్ మనవరాలు మీడియాకు ప్రియమైనదిగా మారింది.
నవ్యకు బాలీవుడ్ డ్రీమ్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎలాగూ స్టార్ల కూతుర్లంటే.. బాలీవుడ్ పడిచస్తోంది కాబట్టి, మెగాస్టార్ మనవరాలికి అవకాశాలు కూడా కలిసి రావొచ్చు! అయితే.. ఐష్ విషయంలో అసంతృప్తిగా ఉన్న బచ్చన్లు.. నవ్యను సినిమాల్లోకి పంపుతారా? అని!
అయితే.. కోడలికి ఉన్న పరిమితులు మనవరాలి విషయంలో పెట్టలేరు. కోడలిపై ప్రేమ వేరు, మనవరాలిపై ఉండే ప్రేమ వేరు. ఇది సహజసూత్రమే! కాబట్టి.. నవ్య హీరోయిన్ గా నటిస్తే.. బిగ్ బికి, జయ బచ్చన్ కు పెద్దగా అభ్యంతరాలు ఉండవేమో! ఈ రకంగా చూస్తే.. మెగాస్టార్ మనవరాలు హీరోయిన్ గా రావడం ఖాయమే.