కొన్ని చానెళ్లకూ సమస్యేనా?

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ జనాలకు, రాజకీయనాయకులకు కాదు, మీడియా రంగానికి కూడా దెబ్బే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ మీడియా రంగానికి కాస్త స్ట్రోక్ తప్పదని…

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ జనాలకు, రాజకీయనాయకులకు కాదు, మీడియా రంగానికి కూడా దెబ్బే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ మీడియా రంగానికి కాస్త స్ట్రోక్ తప్పదని అంటున్నారు. దానికి కారణం విజువల్ మీడియాలో సిబ్బందికి అధికారిక చెల్లింపులు, అనధికారక చెల్లింపులు ఇలా రెండు రకాలు వుంటాయట. 

కింది స్థాయి సిబ్బందికి కాదు కానీ, మీడియం, టాప్ రేంజ్ జనాలకు వైట్ లో కొంత బ్లాక్ లో కొంత పేమెంట్లు జరుగుతాయట. ఈ పద్దతి కొన్ని చానెళ్లలో అమలులో వుందట. అలాంటి వ్యవహారం అమలులో వున్న చానెళ్లకు బ్లాక్ లో వేరే రూపంలో అమౌంట్లు అందుతాయట. అంటే రాజకీయ ఆశ్రితులు, లేదా వేరే అవసరాలు వున్నవారు అన్నమాట. 

వైఎస్ అధికారంలో వుండగా కొన్ని చానెళ్ల, ఒక పత్రిక శాలరీ బిల్లులు ఆయన సమకూర్చేవారన్నవదంతులు వున్నాయి. ఆ తరువాత జగన్ కూడా కొంతకాలం ఒకటి రెండు చానెళ్ల శాలరీ బిల్లులు అడ్జెస్ట్ చేసేవారని వినిపించేంది. ఇలా వేరే విధంగా వచ్చే అమౌంట్లు రావడం ఇకపై కొన్నాళ్ల పాటు కష్టమైపోతుంది. మళ్లీ ఇవన్నీ సెట్ రైట్ కావడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కొన్ని చానెళ్లకు కాస్త ఇబ్బందే.