సూర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన 'సింగం' తెలుగులో 'యముడు' పేరుతో విడుదలయ్యింది. దానికి కొనసాగింపుగా 'సింగం-2' వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సింగం వస్తున్నాడు. అదే 'ఎస్-3'. దీనికి 'యముడు-3' అని చిన్న టైటిల్‌ని 'ఎస్-3' కింద పెట్టార్లెండి. ఈ మూడిట్లోనూ అనుష్క హీరోయిన్‌గా నటించింది.
ఆసక్తికరమైన విషయమేంటంటే, 'సింగం', 'సింగం-2' ('యముడు', 'సింగం' తెలుగులో) సినిమాల్లో అనుష్క గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అందుకే, సెన్సార్ కాస్త కత్తెరేసేసింది అనుష్క గ్లామర్‌కి. కత్తెర అంటే, కత్తెర కాదుగానీ.. 'బ్లర్' చేసేసిందంతే. ఇప్పుడు ముచ్చటగా మూడోస్సారి కూడా అనుష్క గ్లామర్‌కి 'ప్యాచప్' తప్పకపోవచ్చన్నది తమిళ సినీ వర్గాల్లో విన్పిస్తోన్న గుసగుసల సారాంశం.
ఇక, 'ఎస్-3'లో కొంచెం ఓవర్ డోస్ లౌడ్ డైలాగులతోనే సూర్య సందడి చేశాడు. సినిమా చాలా కాస్ట్‌లీగానే తెరకెక్కుతుందనుకోండి.. అది వేరే విషయం. 'సింగం-2'లో అనుష్కతోపాటు హన్సిక నటిస్తే, 'సింగం-3'లో అనుష్కతోపాటు శృతిహాసన్ నటిస్తోంది. ఇదిలా వుంటే, టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో హిట్స్ పడుతున్నాయట 'ఎస్-3'కి. ఎంతైనా, సూర్య నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కదా.. ఆ మాత్రం హీట్ తప్పదు.