భరించలేని ఖర్చును, పోషించలేనంత భారాన్ని తెల్ల ఏనుగుతో పోల్చడం కామన్. యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా కోసం ఇలాంటి ఓ తెల్ల ఏనుగును భరించడానికి రెడీ అయిపోయిందట. దిగ్దర్శకుడు శంకర్ తన రోబో 2 సినిమాకు సైతం భరించలేకపోయిన హాలీవుడ్ టెక్నీషియన్ ను ప్రభాస్ సినిమాకు నియమించుకున్నారట.
ప్రభాస్ సినిమాలో ఓ భారీ ఛేజ్ ను ఆ టెక్నీషయన్ డైరక్షన్ లో చేయడానికి డిసైడ్ అయ్యారు. దుబాయ్ లో చిత్రీకరించే ఈ ఛేజ్ కే నలభై కోట్ల వరకు ఖర్చవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంత ఖర్చు అంటే ముందు ఆ టెక్నీషియన్ కోసమే చాలా ఖర్చయిపోతుందట. అంతా డాలర్లలో పే చేయాలి. పైగా ఆ టెక్నీషియన్ మాట్లాడడానికి కూడా చార్జ్ చేస్తారట.
స్కైప్ లో మాట్లాడితే, ఆ వెంటనే నిమషాల ప్రకారం కాలుక్యులేట్ చేసి బిల్లు వచ్చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఈ నలభై కోట్లలో ఇలాంటి వ్వవహారాలకే చాలా పోతుందన్నమాట. జేమ్స్ బాండ్ తరహా సినిమా కావడంతో, సినిమాకు ఆ ఛేజ్ కీలకం కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్ ను హైర్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాకు మొత్తం బడ్జెట్ 120 నుంచి 150 కోట్లు అని ఎస్టిమేట్ చేసుకుంటున్నారట. జేమ్స్ బాండ్ తరహా సినిమా కావడంతో నేషనల్ వైడ్ మార్కెట్ వుంటుందనే ధీమాతో ఆ మాత్రం ఖర్చుకు తెగిస్తున్నారట.