పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా పనుల్లో బిజీగా వుంటే, చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, 'కాటమరాయుడు'తో 'ఖైదీ' మంతనాలు జరిపారు. ఆ మంతనాలు రాజకీయ పరమైనవేనన్న ప్రచారం ఓ పక్క జరుగుతోంది. జనసేన పార్టీ నిర్మాణంపై పవన్ ఫోకస్ పెడుతున్న సమయంలో చిరు, పవన్ భేటీ రాజకీయంగా ప్రధాన్యతను సంతరించుకోకుండా వుంటుందా.? ఇంకోపక్క, 'కాటమరాయుడు'లో చిరంజీవి కన్పించడానికా.? 'ఖైదీ'లో పవన్‌కళ్యాణ్ కన్పించడానికా ఈ మంతనాలు.? అన్న గుసగుసలు కూడా విన్పిస్తుండడం గమనార్హం.
చిరంజీవి హీరోగా 'శంకర్‌దాదా' సిరీస్‌లో రెండు సినిమాలొచ్చాయి. 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' సినిమాలో ఓ పాటలో పవన్‌కళ్యాణ్ కనిపిస్తాడు. అవును, కనిపిస్తాడంటే కనిపిస్తాడంతే. ఐటమ్ సాంగ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరుస్తాడు శ్రీకాంత్ పక్కన పవన్‌కళ్యాణ్. అప్పట్లో పవన్‌కళ్యాణ్ నటించిన ఓ సినిమా షూటింగ్ కూడా 'శంకర్‌దాదా'తోపాటే జరుగుతుండగా, సరదాగా ఆ సన్నివేశాన్ని అలా చిత్రీకరించారు. ఇక, 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాలో అయితే పవన్‌కళ్యాణ్‌కి డైలాగులే కాదు, ఫైట్ సీన్ కూడా వుంటుందండోయ్.
పలు సినిమాల్లో పవన్‌కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవిని ఏదో ఒకరకంగా గుర్తుచేసుకోవడం కూడా చూశాం. అలా ఇప్పుడు, 'కాటమరాయుడు' సినిమాలో పవన్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కాదు కాదు, 'ఖైదీ'లోనే పవన్‌కళ్యాణ్ కన్పిస్తాడనే ఇంకో గాసిప్ విన్పిస్తోంది. ఈ గాసిప్స్‌లో ఏది నిజమోగానీ, అన్నదమ్ముల కలయిక మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అభిమానుల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది.
దీపావళి సందర్భంగా బయటకొచ్చిన మెగా ఫ్యామిలీ ఫొటోలో పవన్‌కళ్యాణ్ మైనస్ అవడం, దాంతో పవన్ అభిమానులు గుస్సా అయ్యి, అందులోంచి అల్లు హీరోల్ని పక్కకి తోసేసి, పవన్‌కళ్యాణ్‌ని మార్ఫింగ్ చేయడం.. తెల్సిన విషయాలే. ఆ ఫొటో వివాదం తర్వాత, పవన్ – చిరంజీవిని కలవడం ఇంట్రెస్టింగ్ థింగే కదా.!