ఇంతకీ ఆ పాయింట్ ఎక్కడిదో?

అనగనగా ఓ హీరో. అతగాడి ఎడం చేయి అతడు చెప్పిన మాట వినదు. తేడా వస్తే, దానంతట అదే డెసిషన్ తీసుకుని, తాట తీస్తుంది. ఇదీ హీరో కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్. భలేగా వుందిగా? అనిపించేలా…

అనగనగా ఓ హీరో. అతగాడి ఎడం చేయి అతడు చెప్పిన మాట వినదు. తేడా వస్తే, దానంతట అదే డెసిషన్ తీసుకుని, తాట తీస్తుంది. ఇదీ హీరో కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్. భలేగా వుందిగా? అనిపించేలా వుంది. హీరో రవితేజ-బాబి కాంబినేషన్ లో ప్రారంభం కావాల్సి వుండి, నిర్మాతలు వెనకడుగు వేసిన సినిమా కాన్సెప్ట్ ఇదే అని తెలుస్తోంది. 

ఈ సినిమాకు కథ మాటలు కోన వెంకట్ వి. ఇదిలా వుంటే ఓ కొత్త డైరక్టర్ చాన్నాళ్ల కిందటే దర్శకుడు సుకుమార్ కు ఇదే పాయింట్ చెప్పారని తెలుస్తోంది. ఆ మేరకు ఆయన బాగుందని, ఆ కుర్రాడి డైరక్షన్ లోనే చేస్తే ఎలా వుంటుందని అనుకన్నారు. కానీ ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. ఇదిలా వుంటే తాజాగా ఎవరో ఇదే లైన్ ను హీరో కళ్యాణ్ రామ్ దగ్గరకు కూడా తెచ్చారట. 

హీరో గుడ్డివాడుగా వుంటాడు ఫస్ట్ హాఫ్ దాకా..ఇది దర్శకుడు త్రివిక్రమ్ హీరో సూర్య కోసం తయారు చేసిన పాయింట్. హీరో సినిమా అంతా గుడ్డివాడుగా వుంటాడు. ఇది అనిల్ రావిపూడి హీరో రామ్ కోసం తయారుచేసిన పాయింట్. హీరో ఇంటర్వెల్ దాకా గుడ్డివాడుగా వుంటాడు. ఇది వెలిగొండ శ్రీనివాస్ హీరో రాజ్ తరుణ్ కోసం తయారు చేసిన పాయింట్. 

ఇలా ఒకటే పాయింట్ చుట్టూ వేరు వేరు మంది ఒకేసారి కథలు అల్లుతున్నారంటే కాస్త అనుమానమే. అసలు మూలంగా ఇవి ఎక్కడ నుంచి వచ్చి వుంటాయో? కొరియా, హాలీవుడ్, ఇలా చాలా రకాల సినిమాలు వున్నాయిగా మనవాళ్లను ప్రభావితం చేసేవి.