బాలీవుడ్లో దర్శకుడ్ని, కోలీవుడ్‌లో నటుడ్ని, తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌ని.. అని చెప్పుకున్నాడు మొన్నీమధ్యనే ప్రభుదేవా. నిజానికి తెలుగులో ప్రభుదేవా దర్శకుడిగా మూడు సినిమాలు చేశాడు. అందులో ఒకటి సూపర్ హిట్. ఒకటి జస్ట్ యావరేజ్, ఇంకోటి దారుణమైన ఫ్లాప్. చిరంజీవితో 'శంకర్ దాదా జిందాబాద్' చేసిన తర్వాత, బొత్తిగా డైరెక్టర్ ప్రభుదేవా తెలుగు సినీ పరిశ్రమకి మొహం చాటేసేశాడు.
చాలాకాలం తర్వాత మళ్ళీ తెలుగులో డైరెక్షన్ చేయాలని ప్రభుదేవా అనుకుంటున్నాడట. అయితే, అది ఏ ప్రముఖ హీరోతోనో కాదు. ఓ చిన్న సినిమా అట. 'అభినేత్రి' సినిమాని తమిళంలో నిర్మించిన ప్రభుదేవా, అదే కోవలో తెలుగులో ఓ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ లవ్ స్టోరీని తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని తమిళంలోనూ విడుదల చేయాలన్నది ప్రభుదేవా ప్లాన్ అట.
ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాల్ని తప్ప, కోలీవుడ్ – టాలీవుడ్ సినిమాలేవీ డైరెక్టర్‌గా ఒప్పుకోవడంలేదని పైకి చెబుతూనే, ఇంకోపక్క తెరవెనుక తెలుగు సినిమాల్లో దర్శకుడిగా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభుదేవా ప్రయత్నాలైతే ముమ్మరం చేశాడు. మరోపక్క, కొరియోగ్రాఫర్‌గానూ, తిరిగి తెలుగులో సత్తా చాటాలనుకుంటున్నాడు. ఏంటో, ప్రభుదేవాలో ఈ మార్పు.?
అన్నట్లు, ఈ మధ్యనే ప్రభుదేవా తెలుగులో ఓ యంగ్ హీరోకి కథ విన్పించాడనీ, అయితే ఆ కథతో ఆ యంగ్ హీరో ఇంప్రెస్ అవలేదనీ ఓ గాసిప్ హాట్ హాట్‌గా చక్కర్లు కొట్టేస్తోంది. ఇంతకీ ఎవరా హీరో.? ఏమా కథ.? ఏమో, ప్రభుదేవానే పెదవి విప్పాలి.