పవన్ కళ్యాణ్ కు ఉత్తరాది పోకడలు, టైటిళ్లు, గెటప్ లు, పేర్లు అన్నీ భలే ఇష్టం. తన క్యారెక్టర్ల పేర్లు, సినిమాల వ్యవహారాలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. తమిళ సినిమా జిల్లాకు పని చేసిన డైరక్టర్ తో కలిసి చేయబోయే సినిమాకు కూడా ఓ హిందీ టైటిల్ ను పవన్ సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ టైటిల్ చాంబర్ లో అవైలబుల్ గా వుందా లేదా అన్నది చెక్ చేస్తున్నారట. ఈ సినిమా పూజ ఇటీవలే జరిగింది. పూజ టైమ్ లోనే పేరు కూాడా ప్రకటిద్దాం అనుకున్నారట. కానీ, టైటిల్ ఫిక్స్ కాక ఊరుకున్నారట.
గతంలో తీన్ మార్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖుషీ, జల్సా ఇవన్నీ ఇటు తెలుగులా వినిపించే హిందీ పదాలే. అందుకే మళ్లీ ఈ సినిమాకు కూడా అలాంటి టైటిల్ నే పవన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ కనుక వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకుంటే మాత్రం ఇంకో టైటిల్ వెదుకుతారట. అదీ సంగతి.