ఖైదీకి కార్పొరేట్ పబ్లిసిటీ?

మెగాక్యాంప్ లో ముఖ్యంగా చిరు-చరణ్ కు కీలక సమస్య పాజిటివ్ పబ్లిసిటీ. సినిమాలకు హైప్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఖైదీ 150 సినిమాకు, అలాగే పనిలో పనిగా…

మెగాక్యాంప్ లో ముఖ్యంగా చిరు-చరణ్ కు కీలక సమస్య పాజిటివ్ పబ్లిసిటీ. సినిమాలకు హైప్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఖైదీ 150 సినిమాకు, అలాగే పనిలో పనిగా రామ్ చరణ్ ధృవకు కార్పొరేట్ పీఆర్ ఏజెన్సీని అపాయింట్ చేస్తే ఎలా వుంటుందని ఇప్పుడు డిస్కషన్లు జరుగుతున్నాయట.  

రామ్ చరణ్ కోసం ముంబాయిలో ఓ పీఆర్ ఏజెన్సీతో ఉపాసన టచ్ లో వున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అది బాలీవుడ్ వరకే. ఇప్పుడు దాన్నే టాలీవుడ్ కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నారట. దానివల్ల ఫలితం వుంటుందేమో అని ప్లాన్ చేస్తున్నారట. 

కానీ విషయం ఏమిటంటే, అసలు ఏ జరుగుతోందో, ఎలా జరుగుతోదందో చెప్పకుండా, రెండు మూడు ఫొటొలు, జస్ట్ ఏదో ఒక అప్ డేట్ వదిల్తే ఎవరికి మాత్రం ఆసక్తి వుంటుంది. కాస్త ఇంట్రస్టింగ్ గా సినిమా విశేషాల మీడియాకు వదలడం అన్నది ముందు తెలుసుకోవావాలి.లేదా బాహుబలి టీమ్ ను అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలా చేయకుండా ముంబాయి పీఆర్ ఏజెన్సీని తెచ్చుకున్నా సుఖమేముంటుంది?