ఇప్పటికిప్పుడు మెటీరియలైజ్ కాకపోవచ్చు, బాహుబలి తరువాత కూడా వుండదు. కానీ ఆ తరువాత అయినా రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ సినిమా పక్కా అంట. ఈ మేరకు అగ్రిమెంట్ వుందట. నిర్మాత కెఎల్ నారాయణ కు మహేష్ తో సినిమా చేయడానికి రాజమౌళితో అగ్రిమెంట్ వుందట.
బాహుబలి తరువాత వరుసగా తనకు వున్న రెండు కమిట్ మెంట్లు పూర్తి చేసేయాలని దర్శకుడు రాజమౌళి డిసైడ్ అయ్యారట. వాటిలో ఒకటి దానయ్యతో, రెండవది కెఎల్ నారాయణతో. రెండో దానికి హీరో మహేష్ ఫిక్స్. దానయ్య సినిమాకే హీరో ఎవరన్నది ఇంకా వెల్లడి కావడం లేదు. అయితే ఇది కూడా మీడియమ్ సినిమా కాదట కాస్త పెద్ద సినిమానేనట.
బహుశా ఒకటి రెండు భాషల నటులను తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం కాకపోవచ్చని వినికిడి. సూర్య మీద కూడా రాజమౌళి దృష్టి వుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు అయిన తరువాతే రాజమౌళి మళ్లీ భారీ సినిమాల గురించి ఆలోచిస్తారట.
ప్రస్తుతం చేస్తున్న బాహుబలి సినిమా అన్నీ పూర్తి చేసుకుని, రాజమౌళి ఫ్రీ అయ్యేసరికి 2017 జూన్ దాటిపోతుంది. ఆ తరువాత ముచ్చటలు ఇవన్నీ.