నమ్రత వర్రీ అదొక్కటేనట

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కు భార్య. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. సంపద సరే సరి. మరింక వర్రీ ఏంటీ నమ్రతకు? వుంటాయి.. వున్నాయి.. ఎంతటి వాళ్లకైనా వాళ్ల లెవెల్ వర్రీలు వాళ్లకు…

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కు భార్య. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. సంపద సరే సరి. మరింక వర్రీ ఏంటీ నమ్రతకు? వుంటాయి.. వున్నాయి.. ఎంతటి వాళ్లకైనా వాళ్ల లెవెల్ వర్రీలు వాళ్లకు వుంటాయి. నమ్రతకు వర్రీ వుంది. ఆ వర్రీ అంతా భర్త మహేష్ గురించే. అదేంటంటీ మరీ అంత బాధపడిపోవాల్సిన విషయం కాదు. అయినా నమ్రత దృష్టిలో పెద్దదే.

ఇంతకూ అదేంటంటే, మహేష్ గురించి ఎక్కడ నెగిటివ్ వార్తలు వచ్చినా ఆమె చాలా ఫీలయిపోతుందట. సినిమాలు ఎలా వున్నా ఓకె. ఒక సినిమా కాకపోతే మరో సినిమా హిట్ అవుతుంది. కానీ మహేష్ ను క్రిటిసైజ్ చేస్తూనో, మహేష్ వ్యవహారాలను క్రిటిసైజ్ చేస్తూనో వార్తలు వస్తే మాత్రం నమ్రత చాలా ఫీలవుతారట. 

అలాంటివి రాకుండా చూడమని తనకు దగ్గరయిన జనాలకు చెబుతూ వుంటారట. మహేష్ వ్యవహారాలన్నీ నమ్రతే చక్కబెడుతున్న సంగతి తెలిసిందే. సినిమా షెడ్యూళ్లు, పబ్లిసిటీ, రెమ్యూనిరేషన్ ఇలా ఒకటేమిటి అన్నీ. అందుకే ఆ మాత్రం వర్రీ వుంటుంది మరి.