అన్నీ అనుకున్నట్లుగానే జరిగి వుంటే, ఈ విజయదశమికి ముందే 'ధృవ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. కానీ, డిసెంబర్‌కి షిఫ్టయిపోయింది. అయితే, డిసెంబర్ విషయంలోనూ పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. డిసెంబర్లో వచ్చేస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి లీకేజ్‌లు బయటకు రావడం తప్ప, అధికారికంగా డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు.
రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్లీ' వచ్చి చాలాకాలమే అయ్యింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు చరణ్. కారణం, 'బ్రూస్లీ' అంచనాల్ని అందుకోలేకపోవడమే. 'ఆరెంజ్' తర్వాత ఆ స్థాయి పరాజయాన్ని 'బ్రూస్లీ'తో అందుకున్నాడు మరి. వసూళ్ళ పరంగా 40 కోట్ల మార్క్ చేరుకున్నా, నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన ప్రాజెక్ట్‌గా 'బ్రూస్లీ' వార్తల్లోకెక్కింది. దాంతో, తన తదుపరి సినిమా 'ధృవ' విషయమై రామ్‌చరణ్‌లో కొంత ఆందోళన వుండడం సహజమే.
మెరుగులు దిద్దే క్రమంలో సినిమా షూటింగ్ సాగతీతకు గురవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోపక్క సాంకేతిక కారణాలన్న వాదనలూ విన్పిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. డిసెంబర్లో గనుక 'ధృవ' ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేకపోతే, సంక్రాంతి సీజన్‌ని కూడా మిస్సవ్వాల్సి వస్తుందేమో. ఎందుకంటే, సంక్రాంతికి 'ఖైదీ నెంబర్ 150' ఫిక్సయిపోయింది మరి.! ఒకటి చరణ్ హీరోగా నటిస్తున్న 'ధృవ' కాగా, ఇంకొకటి చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా వస్తున్న 'ఖైదీ నెంబర్ 150'. సో, రెండు చిత్రాలూ పోటీ పడే పరిస్థితే లేదు.
తమిళ సినిమా 'తని ఒరువన్'ని 'ధృవ'గా రీమేక్ చేస్తున్న చరణ్, 'ధృవ' సినిమాని పరుగులు పెట్టించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే. ఈ సినిమా కారణంగా సురేందర్‌రెడ్డి లాక్ అయిపోవడం మరో విశేషం.