బాలయ్య ప్రెస్టీజియస్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణి సేల్ స్టార్ట్ అయింది. మంచి రోజు అనే ఉద్దేశంతో ఈ రోజు డీల్స్ పైనల్ చేయడం ప్రారంభించారు. సీడెడ్ హక్కులు దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్లకు వారాహి అధినేత సాయి కొర్రపాటి తీసుకున్నారు.మిగిలిన ఏరియాలు డిస్కషన్లు నడుస్తున్నాయి.
ఆంధ్రకు పాతిక నుంచి ముఫై కోట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నైజాం 18కి పైనే చెబుతున్నారని వినికిడి. మొత్తానికి శాతకర్ణి సినిమాకు మంచి బజ్ నే వచ్చినట్లుంది. అయితే చారిత్రక సినిమాలను జనం ఎంతవరకు ఆదరిస్తారన్నది ఓ డిస్కషన్ పాయింట్ గా వుంది. బాలయ్య వందో సినిమా కావడం, అది కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో బయ్యర్లలో కొంత క్రేజ్ వచ్చింది.
ఈ లెక్కన ఈ సినిమా కూడా డెభై అయిదు నుంచి ఎనభై కోట్ల మేరకు అమ్మకాలు సాగించేలా కనిపిస్తోంది.