హీరోయిన్ సమంత మతం మార్చుకుందనే ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను వివాహమాడనున్న సమంత, హిందూ మతంలోకి మారేందుకుగాను ప్రత్యేక పూజలు చేసిందట. నాగార్జున, నాగచైతన్య, సమంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లుగా కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో, పెళ్ళి కోసమే హీరోయిన్ నయనతార కూడా మతం మార్చుకుంది. అప్పట్లో ఆమె కొరియోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ ప్రభుదేవా కోసం మతం మార్చుకున్న విషయం విదితమే. అయితే, వారిద్దరి ప్రేమాయణం బెడిసి కొట్టింది. ఇద్దరూ విడిపోయారు. అప్పటికే పెళ్ళయివున్న ప్రభుదేవా, మొదటి భార్యకు దూరం కాలేక, మానసిక సంఘర్షణతో నయనతారని దూరం చేసుకున్నాడనుకోండి.. అది వేరే విషయం.
ఇక, సమంత – నాగచైతన్య ప్రత్యేక పూజల వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఇది మత మార్పిడి కాదనేవారూ లేకపోలేదు. ఇంకోపక్క, ఈ ఫొటోల్ని చూసి సమంత, నాగచైతన్య నిశ్చితార్థం కామ్‌గా అయిపోయిందనే గుసగుసలు కూడా విన్పిస్తున్నాయి. ఏమో, సమంత మతం మార్చుకుందంటూ వస్తోన్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అక్కినేని ప్యామిలీ స్పందించాలి, లేదంటే సమంత ఆ విషయాన్ని అనౌన్స్ చేయాలి. అప్పటిదాకా సస్పెన్స్ తప్పదు.