అలనాటి హీరోయిన్ విడాకులు కన్ఫర్మ్!

లిజి, ప్రియదర్శన్… ఈ జంట విడాకుల వ్యవహారం దాదాపు రెండేళ్లుగా చర్చ లో ఉంది. వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపును ఇవ్వనున్నారని, విడాకులు తీసుకోనున్నారని చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. ఆ…

లిజి, ప్రియదర్శన్… ఈ జంట విడాకుల వ్యవహారం దాదాపు రెండేళ్లుగా చర్చ లో ఉంది. వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపును ఇవ్వనున్నారని, విడాకులు తీసుకోనున్నారని చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తి అయ్యి.. ఉమ్మడి అంగీకారం మీద వీరికి విడాకులు మంజూరు అయ్యాయి.

ఈ మేరకు లిజి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. విడాకుల ప్రక్రియ పూర్తి అయినట్టుగా ఆమె ప్రకటించింది. 1990లో లిజి, ప్రియదర్శన్ ల వివాహం జరిగింది. అప్పట్లో లిజి దక్షిణాదిన బిజీ ఆర్టిస్టుగానే ఉండేది. తెలుగులో “ఇరవైవ శతాబ్దం’’ “ఆత్మబంధం’’ వంటి సినిమాల్లో నటించిందామె.

ప్రియన్ , లిజి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. దాదాపు 14 సంవత్సరాల పాటు  వైవాహికజీవితాన్ని గడిపిన తర్వాత రెండేళ్ల నుంచి వీరు వేరుగా ఉంటున్నారు.